
హుజూరాబాద్, వెలుగు : హుజూరాబాద్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో పిచ్చికుక్కల దాడిలో 25 మందికి పైగా గాయాలయ్యాయి. మున్సిపల్ పరిధిలోని బోర్నపల్లి, ప్రతాపవాడ, మామిండ్లవాడ, గాంధీనగర్, పద్మనగర్, విద్యానగర్, ఏకలవ్యనగర్‌లలో రెండు పిచ్చికుక్కలు బుధవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు 25 మందిని కరిచినట్లు స్థానికులు తెలిపారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో వరంగల్ ఎంజీఎం తరలించారు. మిగతావారు స్థానిక ఏరియా, ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స తీసుకున్నారు.