- పెరుగుతున్న సైబర్ క్రైమ్స్
- కామారెడ్డి జిల్లాలో 2 నెలల్లోనే 40 కి పైగా కేసులు
- అకౌంట్ల నుంచి సుమారు రూ. 50 లక్షలు ఖాళీ
- గతేడాది 277 కేసులు, రూ. 2.29 కోట్లు
- పైసలు కోట్లలో పోతున్నా.. రికవరీ లక్షల్లోనే..
- లబోదిబోమంటున్న బాధితులు
కామారెడ్డి, వెలుగు: జిల్లాలో సైబర్‌నేరాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. బ్యాంక్ అకౌంట్‌కు ఆధార్ లింక్ చేయాల్సి ఉందని, డెబిట్, క్రెడిట్ కార్డుల్లో బర్త్ డేట్సరి చేయాలని, పిన్ నంబర్ మార్చుకోవాలని, లక్కీ డ్రా వెళ్లిందని, కరెంటు బిల్లు చెల్లించలేదని, ఉపాధి అవకాశాల పేరుతో గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్నారు. సైబర్‌మోసగాళ్లు చెప్పే మాయ మాటలు నిజమేనని నమ్మి చాలా మంది మోసపోతున్నారు. ఆ తర్వాత బ్యాంక్అకౌంట్లుఖాళీ అవుతుండడంతో తేరుకొని లబోదిబోమంటున్నారు.
జిల్లాలో పరిస్థితి ఇది..
ఈ ఏడాది ఆరంభం నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 40కి పైగా సైబర్ క్రైమ్స్ జరిగాయి. పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ చేయనివి కూడా చాలా ఉన్నాయి. రూ. 2వేల నుంచి రూ. 2లక్షల వరకు నష్టపోయిన బాధితులు ఉన్నారు. 2 నెలల కాలంలోనే రూ. 50లక్షలకు పైగా సొమ్ము సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లినట్లు పోలీసుల లెక్కలు చెప్తున్నాయి. 2022లో కూడా సైబర్ క్రైంకు సంబంధించి 277 కేసులు నమోదు కాగా, రూ.2.29 కోట్లు బాధితులు పోగొట్టుకున్నారు. ఇందులో ఇప్పటి వరకు రూ.41 లక్షలు మాత్రమే పోలీసులు రికవరీ చేశారు.
గుర్తు తెలియని మహిళల నుంచి ఫోన్లు..
గుర్తు తెలియని మహిళలు యువకులకు ముందుగా నార్మల్ ఫోన్ కాల్స్ చేసి మాటలు కలుపుతున్నారు. అలా ఒకటి రెండు రోజులు మాట్లాడిన తర్వాత వీడియో కాల్ చేసి సదరు యువకులను కూడా వీడియో కాల్లో మాట్లాడమని చెప్తున్నారు. క్రమంగా కాల్మాట్లాడుతూనే న్యూడ్లోకి వెళ్తున్నారు. అలా కాల్కట్చేసిన కొద్ది సేపటికి మళ్లీ ఫోన్‌చేసి వీడియో రికార్డు చేశామని ఆన్లైన్లో పెడతామని బెదిరిస్తూ పైసలు డిమాండ్ చేస్తున్నారు. కొద్ది రోజులుగా జిల్లాలో ఇలాంటి ఘటనలు కామారెడ్డి, ఎల్లారెడ్డి, భిక్నూర్ ఏరియాల్లో ఐదుకు పైగా జరిగాయి. అలా వారి వద్ద నుంచి మహిళలు వేలాది రూపాయలు నొక్కేశారు. బాధితులు ఒకరిద్దరు పోలీసులకు కంప్లైంట్ చేయగా, మరి కొందరు పరువుపోతుందని ఫిర్యాదు చేయడం లేదు.
మాయమాటలు నమ్మి మోసపోవద్దు
గుర్తు తెలియని వ్యక్తులు చేసే ఫోన్ కాల్స్ పై ప్రజలు అలర్ట్‌గా ఉండాలి. తెలియని వ్యక్తులకు ఫోన్లో బ్యాంక్ అకౌంట్, పర్సనల్వివరాలు చెప్పొద్దు. న్యూడ్కాల్మోసాలపై కూడా జాగ్రత్తగా ఉండాలి. జిల్లాలో సైబర్ క్రైమ్స్కంట్రోల్కోసం అవేర్నెస్ ప్రోగ్రామ్స్నిర్వహిస్తున్నాం. అయినా చాలా మంది మోసగాళ్ల మాటలు నమ్మి పైసలు పోగొట్టుకుంటున్నారు.
– బి. శ్రీనివాస్‌రెడ్డి, ఎస్పీ
‘ సదాశివనగర్ మండలం లింగంపల్లికి చెందిన సుభాష్రావుకు ఈ నెల 22న గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌చేసి క్రెడిట్ కార్డులో బర్త్ డేట్ తప్పుగా ఉందని, సరిచేసుకునేందుకు మీ ఫోన్‌కు యాప్‌లింక్ పంపిస్తున్నామని, ఇన్స్టాల్చేసుకోమని చెప్పారు. నిజమేనని నమ్మిన సుభాష్‌రావు వాళ్లు పంపిన లింక్ ఓపెన్ చేసి యాప్ డౌన్లోడ్ చేసుకొని క్లిక్ చేయగానే ఇతడి బ్యాంక్ అకౌంట్లో ఉన్న రూ.1,06,910 అమౌంట్ డెబిట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. బాధితుడు పోలీసులకు కంప్లైంట్ చేశాడు. ఇదే గ్రామానికి చెందిన మరో వ్యక్తికి ఇదే తరహా కాల్ రాగా, యాప్ ఇన్స్టాల్ చేయడంతో అకౌంట్లో ఉన్న రూ. 4వేలు కట్అయ్యాయి.
‘ కామారెడ్డి మున్సిపాలిటీలోని దేవునిపల్లిలో నివాసముండే రాజేశ్వర్‌రావుకు ఈ నెల 20న గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి.. 2 నెలలుగా కరెంట్బిల్లు చెల్లించలేదని.. వెంటనే చెల్లించాలని.. ఆన్లైన్లో చెల్లించేందుకు యాప్లింక్పంపిస్తున్నామని.. దాన్ని క్లిక్ చేసి పే చేయమని చెప్పాడు. నమ్మిన రాజేశ్వర్‌రావు యాప్ క్లిక్ చేయగానే ఇతడి బ్యాంక్అకౌంట్ నుంచి రూ.49 వేలు విత్‌డ్రా అయినట్లు మెసేజ్ రావడంతో వెంటనే పోలీసులకు కంప్లైంట్ చేశాడు. వెంటనే పోలీసులు బ్యాంక్ అకౌంట్‌ను ప్రీజ్ చేయించడంతో డబ్బులు సైబర్ నేరగాళ్ల అకౌంట్లోకి వెళ్లలేదు.’
‘కామారెడ్డి టౌన్‌కు చెందిన ఓ యువకుడికి 10 రోజుల కింద గుర్తు తెలియని యువతి వీడియో కాల్చేసింది. మాటలు కలుపుతూ న్యూడ్లోకి వెళ్లింది. కొద్ది సేపటి తర్వాత యువకుడికి ఫోన్ చేసి తన అకౌంట్‌కు పైసలు పంపాలని లేకపోతే వీడియో సోషల్ మీడియాలో షేర్ చేస్తానని చెప్పింది. ఆ తర్వాత మరో వ్యక్తి ఫోన్ చేసి తాను ఢిల్లీ పోలీస్‌ను మాట్లాడుతున్నానని, మీపై ఓ యువతి కంప్లైంట్ చేసిందని చెప్పడంతో భయపడిన యువకుడు రూ.20వేలు పంపాడు. తర్వాత విడతల వారీగా రూ.80 వేల వరకు యువతి నొక్కేసింది. మోసపోయానని గ్రహించిన యువకుడు పోలీసులకు కంప్లైంట్ చేశాడు. ’