10 నెలల్లో 40 వేల మంది చనిపోయారు.. గాజాలో యుద్ధం మిగిల్చిన విషాదం

10 నెలల్లో 40 వేల మంది చనిపోయారు.. గాజాలో యుద్ధం మిగిల్చిన విషాదం
  • 85 శాతం మంది ఇండ్లను వదిలి వలస 
  • తిండి, మెడిసిన్ దొరకని పరిస్థితిలో పాలస్తీనియన్లు
  • గాజా ఆరోగ్య శాఖ రిపోర్టు

గాజా: ఇజ్రాయెల్, హమాస్ యుద్ధంలో ఇప్పటివరకు 40 వేల మందికి పైగా పాలస్తీనియన్లు చనిపోయారని గాజా హెల్త్ మినిస్ట్రీ గురువారం ప్రకటించింది. ఇజ్రాయెల్ దాడిలో 92 వేల మందికి పైగా గాయపడ్డారని, గాజాలో 85 శాతం మంది ప్రజలు ఇండ్లను విడిచి వలస వెళ్లారని చెప్పింది. ఇజ్రాయెల్ దాడిలో గడిచిన 24 గంటల్లోనే 40 మంది చనిపోయారని, గత 11 నెలలుగా జరుగుతున్న దాడుల్లో మొత్తం మృతుల సంఖ్య 40,005కు చేరిందని  పేర్కొంది.  పోయినేడాది అక్టోబర్​7న హమాస్  మిలిటెంట్లు ఇజ్రాయెల్​పై దాడి చేశారు. 1200 మంది ఇజ్రాయెల్ పౌరులను చంపి.. 250 మందిని బందీలుగా తీసుకెళ్లారు.

అప్పటినుంచి గాజాలోని హమాస్ మిలిటెంట్లపై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు చేస్తోంది. దాదాపు ప్రతిరోజు మిసైల్ దాడులు జరుగుతున్నాయి. దీంతో గాజాలోని అనేక భవనాలు, ఆస్పత్రులు, మసీదులు, స్కూళ్లు నేలమట్టం అయ్యాయి. ప్రజలకు తిండి, మంచినీళ్లు, మెడిసిన్ దొరకని పరిస్థితి ఏర్పడింది. జనాలు ఇండ్లను కోల్పోయారు. టెంపరరీ షెల్టర్లు నిండిపోయాయి. మొత్తం 5 లక్షలదాకా ఉన్న జనాభాలో ఐదోవంతు కంటే ఎక్కువ మంది ఆకలితో అలమటిస్తున్నారు. దాడుల్లో మరణించినవాళ్ల శవాలను పూడ్జేందుకు శ్మశానాల్లో చోటు లేక రోడ్ల పక్కను, ఇండ్ల మెట్ల కింది మరణించిన చోటే పూడ్చివేస్తున్నారు.