- హైదరాబాద్ జిల్లాలో 41% మంది అభ్యర్థులే హాజరు
హైదరాబాద్ సిటీ/కూకట్పల్లి/అబ్దుల్లాపూర్ మెట్/జీడిమెట్ల/వికారాబాద్, వెలుగు: హైదరాబాద్జిల్లాలో గ్రూప్–3 ఎగ్జామ్స్ఆదివారం ప్రశాంతంగా జరిగాయి. మొదటిరోజు ఉదయం 10 గంటలకు పేపర్–1, మధ్యాహ్నం తర్వాత పేపర్–2 నిర్వహించారు. చాలా మంది ఆలస్యంగా సెంటర్లకు చేరుకోవడంతో అధికారులు అనుమతించలేదు. కాగా గ్రూప్–3 ఎగ్జామ్స్కు హాజరు శాతం చాలా తక్కువగా నమోదైంది.
హైదరాబాద్ జిల్లాలో ఎగ్జామ్కు అప్లయ్చేసిన వారిలో దాదాపు 60 శాతం మంది హాజరు కాలేదు. మొత్తం 102 ఎగ్జామ్సెంటర్లు ఏర్పాటు చేయగా, 45,918 మంది అభ్యర్థులకు గానూ18,967 మంది మాత్రమే హాజరయ్యారు. 26,951 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. 41.01 శాతం మంది మాత్రమే ఎగ్జామ్స్రాశారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ మెహిదీపట్నంలోకి జి.పుల్లారెడ్డి డిగ్రీ, పీజీ కాలేజీ సెంటర్ను తనిఖీ చేశారు. కలెక్టర్ వెంట ప్రిన్సిపల్ డాక్టర్ కె.మురళీకృష్ణ, అబ్జర్వర్లు స్వప్న, మంగుబాయి ఉన్నారు.
వికారాబాద్జిల్లాలో 60 శాతం మంది గ్రూప్3 ఎగ్జామ్స్రాశారు. 20 ఎగ్జామ్స్సెంటర్లలో మొత్తం 6,981 మంది అభ్యర్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా, ఫస్ట్పేపర్కు 4,185 మంది, సెకండ్పేపర్ కు 4,195 మంది అభ్యర్థులు హాజరయ్యారు. కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ నారాయణరెడ్డి సెంటర్లను తనిఖీ చేశారు.
రంగారెడ్డి జిల్లా తట్టి అన్నారం, హయత్ నగర్ లోని గ్రూప్–3 సెంటర్లను కలెక్టర్ సి.నారాయణ రెడ్డి పరిశీలించారు. కలెక్టర్ వెంట ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంత్ రెడ్డి, తహసీల్దార్ ఉన్నారు. జిల్లా మొత్తంగా అభ్యర్థుల హాజరుశాతం 60 లోపే ఉంది. 40 శాతం మంది గైర్హాజరయ్యారు.
కూకట్పల్లిలోని పలు గ్రూప్3 పరీక్షా కేంద్రాలను మేడ్చల్జిల్లా కలెక్టర్ గౌతమ్పోట్రు పరిశీలించారు. బాలాజీ నగర్లోని గౌతమి కాలేజీ సెంటర్కు వెళ్లాల్సిన ఓ అభ్యర్థిని పొరపాటున జీడిమెట్లలోని గౌతమి కాలేజీకి వచ్చింది. విషయం తెలుసుకున్న జీడిమెట్ల ట్రాఫిక్సీఐ శ్రీనివాస్తన వెహికల్ లో ఆమెను సకాలంలో పరీక్షా కేంద్రానికి చేర్చారు.