AI వాడకంలో మనమే ఫస్ట్..సర్వేల్లో వెల్లడి

AI వాడకంలో మనమే ఫస్ట్..సర్వేల్లో వెల్లడి

న్యూఢిల్లీ: మనదేశంలో ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​(ఏఐ) వాడకం వేగంగా పెరుగుతోందని టెక్నాలజీ కంపెనీ మైక్రోసాఫ్ట్​ సర్వే వెల్లడించింది. ఇందులో పాల్గొన్న వారిలో 65 శాతం మంది ఏఐని వాడినట్టు తెలిపారు. ఇది ప్రపంచ సగటు  కంటే రెట్టింపు కావడం విశేషం.  

మైక్రోసాఫ్ట్ మంగళవారం గ్లోబల్ ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ సేఫ్టీ సర్వే రిపోర్టును విడుదల చేసింది. గత ఏడాది జులై 19– ఆగస్టు 9 మధ్య 15 దేశాలలో 15,000 మంది టీనేజర్లు (13–-17)  పెద్దల నుంచి వివరాలు తీసుకుంది.  

ఏఐ వాడకం విషయంలో ప్రపంచ సగటు 31 శాతం శాతం కాగా మనదేశంలో ఇది రెట్టింపు ఉంది. అనువాదాల కోసం, ప్రశ్నలకు సమాధానాల కోసం, పనిలో సామర్థ్యాన్ని పెంచడం కోసం, హోంవర్క్​లో సాయం కోసం ఏఐను వాడుతున్నారు. 

రెస్పాండెంట్లలో మిలీనియల్స్ (25–44 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులు) ఏఐను సమర్థంగా వాడుకుంటున్నారు. వీరిలో 84 శాతం మంది ఏఐ సాయం తీసుకుంటున్నట్టు చెప్పారు.  ఏఐ దుర్వినియోగం, డీప్‌‌‌‌‌‌‌‌ఫేక్‌‌‌‌‌‌‌‌ల గురించి భయాలూ ఉన్నాయని రెస్పాండెంట్లు చెప్పారు.