అమ్మడుపోని కార్లు 7 లక్షలు.. డీలర్ల దగ్గర కుప్పలుగా పడి ఉన్న వాహనాలు

అమ్మడుపోని కార్లు 7 లక్షలు.. డీలర్ల దగ్గర కుప్పలుగా పడి ఉన్న వాహనాలు

ఆటోమొబైల్ రంగం సంక్షోభంలో పడింది. ఓ వైపు బైక్ సేల్స్ విపరీతంగా పెరగ్గా.. కార్ల అమ్మకాలు దారుణంగా పడిపోయాయి. గత ఏడాదితో పోల్చితే ఇది 17 శాతం తక్కువ. అమ్మకాలు బాగుంటాయన్న ఉద్దేశంతో.. అన్ని కార్ల కంపెనీలు.. అంచనాలకు తగ్గట్టు ఉత్పత్తి చేశాయి. మార్కెట్ అందుకు భిన్నంగా ఉండటంతో.. డీలర్ల దగ్గర కొత్త కార్లు పేరుకుపోయాయి. అన్ని కంపెనీల కార్లను లెక్కలోకి తీసుకుంటే ఇది 7 లక్షల కార్ల వరకు ఉంది. దీని విలువ ఎంతో తెలుసా.. అక్షరాల 73 వేల కోట్ల రూపాయలు. గత కొన్ని సంవత్సరాలతోపోల్చితే ఇది భారీ సంఖ్యగా చెబుతోంది సొసైటీ ఆఫ్ ఇండియాన్ ఆటోమొబైల్ మ్యాన్యుఫాక్చరర్స్ సంస్థ. 

ఈ 7 లక్షల కార్లకు అమ్మాలంటే.. దేశవ్యాప్తంగా కనీసంలో కనీసం రెండు నెలల సమయం పడుతుందని.. అది కూడా కొనుగోళ్లు బాగుంటేనే అని అంచనా వేస్తుంది సియామ్. 

Also Read:-హైడ్రా దగ్గరున్న ఆయుధాలివే.. జపాన్ నుంచి ఈ బాహుబలి మెషన్స్

ఇప్పటికే మార్కెట్ లో నెంబర్ వన్ గా కొనసాగుతున్న మారుతి సుజుకి కార్ల సేల్స్ భారీగా తగ్గాయని నివేదికలు చెబుతున్నాయి. 2024.. 25 ఆర్థిక సంవత్సరంలో.. మొదటి ఆరు నెలల కాలంలో కంపెనీ అంచనా సేల్స్ ను అందుకోలేకపోయింది. దీంతో డీలర్ల దగ్గర కొత్త కార్లు భారీగా మిగిలిపోయాయి. ఇదే క్రమంలో ఉత్పత్తిని కొనసాగించటంతో ఇప్పుడు షోరూమ్స్, గోదాముల్లో భారీగా మారుతి కార్లు అమ్ముడుపోకుండా ఉండిపోయాయి. ఈ విషయాన్ని గుర్తించిన కంపెనీ.. ఇప్పుడు కార్ల తయారీని గణనీయంగా తగ్గించినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అయినప్పటికీ 40 శాతం మార్కెట్ వాటాతో మారుతి సుజుకి నెంబర్ వన్ స్థానంలోనే కొనసాగుతుంది. 

మహీంద్రా, టాటాతోపాటు ఇతర కంపెనీల కార్ల అమ్మకాలు సైతం మొదటి త్రైమాసికంలో ఆశించిన స్థాయిలో టార్గెట్స్ రీచ్ కాలేదనే వార్తలు వస్తున్నాయి. దీనికి కారణాలు కూడా లేకపోలేదు. ఎన్నికల సీజన్, మొదటి త్రైమాసికంలో సహజంగానే ఉండే తగ్గుదల, ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్ వంటి కారణాలతో ఈసారి అమ్మకాలు భారీగా తగ్గాయని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ వెల్లడించింది. 

రాబోయే వినాయచవితి నుంచి సంక్రాంతి మధ్య కాలంలో.. అంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో కార్ల సేల్స్ భారీగా పెరగొచ్చని అంచనా వేస్తోంది డీలర్స్ అసోసియేషన్. సేల్స్ భారీగా పెరిగినా.. ప్రస్తుతం డీలర్ల దగ్గర మిగిలిపోయిన కొత్త కార్లు అమ్ముడుపోవటానికి కనీసం రెండు నెలల సమయం పడుతుందని.. అంటే ఈ రెండు నెలల కాలంలో కార్ల కంపెనీలు ఉత్పత్తిని తగ్గించుకోవాలని సూచిస్తోంది. 

అమ్ముడపోని కొత్త కార్లకు రాబోయే రోజుల్లో భారీ డిస్కొంట్స్ ప్రకటించే అవకాశాలూ లేకపోలేదు. వచ్చేది పండుగల సీజన్.. వినాయచవితి, దసరా, సంక్రాంతి, న్యూ ఇయర్ ఇలా ఫెస్టివల్స్ ఉండటంతో కార్ల కంపెనీలు భారీ డిస్కొంట్స్, ఆఫర్స్ ప్రకటించినా ఆశ్చర్యం లేదు అంటున్నాయి మార్కెట్ వర్గాలు.

మరిన్ని వార్తలు