800 మందికిపైగా కారుణ్య నియామకాలు

  • ఆర్టీసీని నంబర్​1 సంస్థగా మారుస్తం
  • రద్దీకి అనుగుణంగా కొత్త బస్సుల కొనుగోలు, సిబ్బంది నియామకం
  • మంత్రి పొన్నం ప్రభాకర్​

హైదరాబాద్: ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగుల సంక్షేమం దృష్ట్యా వివిధ రకాల ప్రమాదాల్లో మృతి చెందిన కుటుంబాల కోసం 800 మందికి పైగా కారుణ్య నియామ కాలు చేపడుతున్నామని, ఇది నిరంతర ప్రక్రియని మంత్రి పొన్నం ప్రభాకర్​తెలిపారు.

కొండాపూర్ ఎనిమిదో బెటాలియన్ లో  టీఎస్ఆర్టీసీ కానిస్టేబుల్స్ పాసింగ్ ఔట్ పరేడ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, ఇతర  ఉన్నతాధికారులు చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ టీఎస్​ఆర్టీసీని నంబర్ 1 రవాణా సంస్థగా మారుస్తామన్నారు.  

ALSO READ :- నీలోఫర్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. భారీగా మంటలు

మహాలక్ష్మి స్కీం కింద ఇప్పటి వరకు 14.5 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారని తెలిపారు. రద్దీకి అనుగుణంగా నూతన బస్సుల కొనుగోలు, సిబ్బంది నియామకానికి ప్రభుత్వం ముందడుగు వేస్తోందని చెప్పారు. ఆర్టీసీ సంస్థను ప్రజలకు ఉపయోగపడే విధంగా మార్పులు చేర్పులు చేసే ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు.