టిప్పరు ఢీకొని వందకు పైగా గొర్రెలు మృతి 

వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ టిప్పర్ మూగజీవాలను బలితీసుకుంది. ఖానాపురం మండల పాకాల వాగు వంతెనపై గురువారం అర్ధరాత్రి టిప్పర్‌  గొర్రెల మందను  ఢీకొట్టింది.  ఈ ఘటనలో వందకు పైగా  గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. పాకాల-వాజేడు అటవీ ప్రాంతంలో గొర్రెల యజమాని తన 600 గొర్రెలు మేపుకొని ఇంటికి వెళ్తుండగా వెనుక నుంచి స్పీడ్ గా మట్టి లోడుతో వచ్చిన టిప్పర్‌ గొర్రెల మీది నుంచి దూస్కెళ్లింది. ప్రమాదంలో  గొర్రెలు మృతి చెందాయి. చనిపోయిన గొర్రెలు టిప్పర్‌ టైర్ల  మధ్య ఇరుక్కుపోవడంతో కదలడానికి కూడా వీలులేక  టిప్పర్ ఆగిపోయింది. దీంతో  డ్రైవర్‌ వాహనం వదిలి పారిపోయాడు. సుమారు రూ.18 లక్షల నష్టం జరిగిందని గొర్రెల యజమాని వాపోయాడు. విషయం తెలుసుకున్న ఖానాపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.