యూట్యూబ్ షార్ట్స్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేక చెప్పాల్సిన పనిలేదు. టిక్ టాక్ బ్యాన్ తర్వాత ప్రతి ఒక్కరు యూ ట్యూబ్ షార్ట్స్ చేస్తున్నారు. చిన్నా చితకా.. వయసుతో సంబంధం లేకుండా చాలా మంది యూ ట్యూబ్ షార్ట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వేలాది సబ్ స్క్రైబర్స్ తో ఫేమస్ కావడంతో పాటు డబ్బు సంపాదిస్తున్నారు. ఆకర్షణీయమైన కంటెంట్ తో ఒక్కొక్కరు లక్షలు సంపాదిస్తున్నారు. ఈ మధ్య యూ ట్యూబ్ షార్ట్స్ నుంచి సంపాదిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది.
యూ ట్యూబ్ మానిటైజేషన్ ప్రోగ్రామ్‌లో 25 శాతం ఛానెల్‌లు ఇప్పుడు YouTube Shorts నుండి డబ్బు సంపాదిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. YPP(యూట్యూబ్ పార్ట్ నర్ ప్రోగ్రాం) లో చేరిన యూ ట్యూబ్ క్రియేటర్‌లలో 80 శాతం కంటే ఎక్కువ మంది ఇప్పుడు YouTubeలో ఇతర YPP మానిటైజేషన్ ఫీచర్‌ల ద్వారా కూడా సంపాదిస్తున్నారని Google యాజమాన్యంలోని ప్లాట్‌ఫారమ్ తెలిపింది.
గత మూడేళ్లలో క్రియేటర్స్ , మీడియా కంపెనీలకు YouTube $70 బిలియన్లు చెల్లించిందని వెల్లడించింది. Shorts లో సగటున 70 బిలియన్ల రోజువారీ వ్యూస్ వస్తున్నాని తెలిపింది . యూ ట్యూబ్ షార్ట్ ల నుంచి వచ్చే ఆదాయం తన జీవితాన్ని మార్చిందని అలాన్ చికిన్ చౌ (38.7 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్‌లను కలిగిన డిజిటల్ కంటెంట్ క్రియేటర్ ) అన్నారు. షార్ట్స్ క్రియేటర్‌గా USలో అత్యధిక వ్యూస్ ఉన్న ఛానెల్‌లలో ఈయనది ఒకటి. కంపెనీ 16 ఏళ్ల క్రితం YPP(యూట్యూబ్ పార్ట్ నర్ ప్రోగ్రాం) ని ప్రవేశపెట్టింది. అతి కొద్దిమంది క్రియేటర్‌లతో మొదలైన ఈ YPP ప్రపంచవ్యాప్తంగా 3 మిలియన్ల కంటే ఎక్కువ క్రియేటర్‌లకు పెరిగిందని కంపెనీ తెలిపింది.