రెండు వేలకు పైగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అప్లికేషన్స్ షూరూ

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది.  కేంద్ర ప్రభుత్వ ఆయా విభాగాల్లో 2049 పోస్టులను భర్తీ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. పోస్టులను బట్టీ ఇంటర్, టెన్త్, డిగ్రీ, పీజీ విద్యా అర్హత ఉండాలి.  అధికారిక వెబ్ సైట్ లో ఫిబ్రవరి 26 నుంచి అప్లికేషన్స్ స్వీకరించడం ప్రారంభించారు.  మార్చి 18 వరకు అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు చెల్లింపు చివరి తేది మార్చి 19.  మార్చి 22వ తేదీ నుంచి మార్చి 24వ తేదీ వరకు దరఖాస్తు సవరణ అవకాశం కల్పించారు.

SSC భర్తీ చేసే ఉద్యాగాన్ని బట్టి అభ్యర్థుల వయోపరిమితి18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. కేటగిరీల వారీగా వయో సడలింపు కల్పించారు. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌లకు మూడేళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు సడలింపు ఇచ్చారు. ఇక దరఖాస్తు ఫీజు విషయానికొస్తే జనరల్‌/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.100. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/మహిళలు/ఎక్స్‌సర్వీస్‌మెన్‌ కేటగిరీకి చెందిన వారికి పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు.