హైదరాబాద్: ఫార్ములా ఈ-కార్ రేస్ కేసుకు సంబంధించి తెలంగాణ ఏసీబీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు లేఖ రాశారు. కేటీఆర్ పై నమోదైన కేసు వివరాలను ఇవ్వాలని ఏసీబీని ఈడీ కోరింది. కేటీఆర్ పై నమోదైన ఎఫ్ఐఆర్ కాపీతో పాటు హెచ్ఎండీఏ అకౌంట్ నుంచి నగదు బదిలీకి సంబంధించి ఈడీ వివరాలు కోరింది. దాన కిషోర్ కాపీ కూడా పంపాలని ఈడీని కోరింది. ఎంత మొత్తం బదిలీ చేశారో, ఏఏ తేదీల్లో నగదు బదిలీ జరిగిందో పూర్తి వివరాలను ఇవ్వాలని ఏసీబీకి ఈడీ స్పష్టం చేసింది. రెగ్యులర్ ప్రాసెస్ లో భాగంగానే ఈడీ అధికారులు ఆరా తీసినప్పటికీ బీఆర్ఎస్ శ్రేణుల్లో, నేతల్లో ఆందోళన అంతకంతకూ పెరిగిపోతుంది. ఫార్ములా ఈ-కార్ రేస్ నిర్వహణలో నిబంధనలకు విరుద్ధంగా విదేశీ సంస్థకు చెల్లింపులు జరిగాయని ఆరోపణలున్నాయి.
ఆర్బీఐకి సమాచారం లేకుండా విదేశాలకు రూ. 45.71 కోట్లు ట్రాన్స్‌ఫర్ చేసినందుకు హెచ్ఎండీఏకు ఇన్‌కమ్‌ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ రూ.8 కోట్ల 6 లక్షల 75 వేల 404 ఫైన్ వేసింది. దీంతో పాటు వివిధ ఫీజుల రూపంలో ఫెడరేషన్ఇంటర్నేషనల్ ఆటోమొబైల్, ఫెడరేషన్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్స్ ఆఫ్ ఇండియాకు మరో రూ.కోటి 10 లక్షల 51 వేల 14 ను హెచ్‌ఎండీఏ చెల్లించింది. ఇట్ల ఫార్ములా ఈ రేస్ సీజన్ 10 కోసం మొత్తంగా రూ.54 కోట్ల 88 లక్షల 87 వేల 43ను హెచ్‌ఎండీఏ చెల్లింపులు జరిపింది. హెచ్ఎండీఏ రూల్స్ప్రకారం రూ. 10 కోట్ల కంటే ఎక్కువ చెల్లింపులు చేయాలంటే ప్రభుత్వం, ఆర్థిక శాఖ అనుమతి తప్పనిసరి. కానీ.. నాడు ఈ నిబంధనలేవీ పట్టించుకోలేదు.
ALSO READ : ఎన్నికల కోడ్ ఉన్నప్పుడే.. ఫార్ములా ఈ రేసింగ్ అగ్రిమెంట్.. లండన్ కు డబ్బు తరలింపు
హెచ్‌ఎండీఏ బోర్డు నిధుల దుర్వినియోగంపై వివరణ ఇవ్వాలని సీఎస్ శాంతికుమారి జనవరి 6న ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్‌కు మెమో జారీ చేసింది. దీనికి వివరణ ఇస్తూ జనవరి 24న ఆయన సీఎస్‌కు ఎక్స్‌ప్లనేషన్ లెటర్ రాశారు. ఫార్ములా ఈ ఆపరేషన్స్, ఎక్స్ నెక్ట్స్ జెన్ సహా ఎంఏయూడీ ఒప్పందాలు, డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసిన వివరాలను వెల్లడించారు. అప్పటి మున్సిపల్ మినిస్టర్ కేటీఆర్ ఆదేశాల మేరకే హెచ్‌ఎండీఏ బోర్డు నిధులను ఫార్ములా ఈ ఆపరేషన్స్‌కు చెల్లించినట్లు వివరించారు. అక్టోబర్ 18న ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిశోర్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఇదే క్రమంలో రంగంలోకి దిగిన ఏసీబీ.. అవినీతికి సంబంధించి పక్కా ఆధారాలు సేకరించింది.