G20 summit: వీసాలు తిరిగి ప్రారంభించాలి..ఇండియాకు చైనా పిలుపు

G20 summit: వీసాలు తిరిగి ప్రారంభించాలి..ఇండియాకు చైనా పిలుపు

కరోనా సమయంలో భారత్, చైనాల మధ్య ప్రత్యక్ష విమానాల రాకపోకలు, వీసాల జారీ రద్దు చేయబడిన విషయం తెలిసిందే.. దీంతోపాటు భారత్ , చైనాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు చెడిపోవడంతో దాదాపు నాలుగేళ్ల పాటు ఈరెండు దేశాల మధ్య ప్రత్యక్ష సంబంధాలు నిలిచిపోయాయి.  ఇటీవల ఈ రెండు దేశాల మధ్య స్నేహపూర్వక వాతావరణ నెలకొనడం, రెండు దేశాల మధ్య సరిహద్దుల్లో శాంతి నెలకొనడంతో తిరిగి ద్వైపాక్షిక సంబంధాలు బలపడుతున్నాయి. ఈక్రమంలో బ్రెజిల్ లో జరుగుతున్న G20 సమ్మిట్ లో సమావేశమైన ఇరు దేశాల నేతలు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.ఇందులో భాగంగా భారత, చైనాల మధ్య ప్రత్యక్ష విమానాలు, వీసా పునరుద్దరణ ప్రారంభించాలని చైనా కోరింది. 

చైనా సిటిజన్లకోసం భారత్ తిరిగి వీసాలు ప్రారంభించాలని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ కోరారు. బ్రెజిల్ లోని రియో డి జెనీరోలో జరుగుతున్న G20 సదస్సులో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ , చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారత్ చైనా సంబంధాలకుసంబంధించి పలు కీలక అంశాలను చర్చించారు. భారత్, చైనా మధ్య విమానాలను తిరిగి ప్రారంభించాలని కోరారు. 

2020లో కోవిడ్ 19 మహమ్మారి విజృంభించడంతో భారత్.. చైనా జాతీయులపై వీసా పరిమితులు విధించింది. చైనాకు ప్రత్యక్ష విమానాలను రద్దు చేసింది. జైశంకర్, వాంగ్ యీ మధ్య జరిగిన చర్చలు ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక  సంబంధాలను బలోపేతం చేసే దిశగా సాగాయి. 

ఇరు దేశాల మధ్య ప్రజారవాణా, వాణిజ్యం పెంచేదిశగా భారత్ అడుగులు వేయాలని చైనా విదేశాంగ మంత్రివాంగ్ యీ కోరారు.  జర్నలిస్టులకు అనుమతి, వీసా తిరిగి ప్రారంభించడం ద్వారా ఇరుదేశాల మధ్య సహకారాన్ని వేగవంతం చేయాలని వాంగ్ యీ భారత్ ను కోరారు. 

భారత విదేశాంగ మంత్రి జైశంకర్ మాట్లాడుతూ.. 2020 నుంచి లడఖ్ ప్రాంతంలో సైనిక చర్యలతో ఉద్రిక్తలకు కేంద్ర బిందువుగా ఉంది.. గత నెలలో ఇరుదేశాల మధ్య జరిగిన ఒప్పందం తర్వాత రెండు సైనిక ఉపసంహరణ పురోగతిపై జైశంకర్ ప్రశంసలు కురిపించారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను జైశంకర్ సోషల్ మీడియాలో ప్లాట్ ఫాం X లో పోస్ట్ షేర్ చేశారు.