BCCI: గంభీర్ కోరిక నెరవేరింది.. బౌలింగ్ కోచ్‌గా సఫారీ మాజీ పేసర్

భారత క్రికెట్ జట్టు బౌలింగ్ కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ పేసర్ మోర్నీ మోర్కెల్ నియమితులయ్యారు. ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ జై షా అధికారికంగా ధృవీకరించినట్లు క్రిక్‌బజ్‌ కథనాన్ని ప్రచురించింది. మోర్నీ మోర్కెల్ పదవీ కాలం సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభం కానుందని సమాచారం. ఈ విషయంపై బీసీసీఐ నుండి బీసీసీఐ అధికారిక ప్రకటన వెలుబడాల్సి ఉంది. 

బౌలింగ్ కోచ్‌గా మోర్కెల్ మొదటి అసైన్‌మెంట్.. త్వరలో బంగ్లాదేశ్‌తో జరిగే స్వదేశీ టెస్ట్ సిరీస్. సెప్టెంబర్ 19 నుండి ప్రారంభమయ్యే ఈ సిరీస్‌లో భారత్‌ - బంగ్లాదేశ్ రెండు టెస్టులు, మూడు టీ20ల్లో తలపడనున్నాయి. అనంతరం న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల సిరీస్ షురూ కానుంది. 

దక్షిణాఫ్రికా బౌలరైన మోర్కెల్.. మంచి పేసర్. క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు పలికాక ఈ సఫారీ పేసర్ కోచింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఐపీఎల్ ఫ్రాంచైజీ లక్నో సూపర్ గెయింట్స్(LSG) బౌలింగ్ కోచ్‌గా పనిచేశాడు. గతేడాది భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ ముగిసే వరకూ దాయాది పాకిస్థాన్ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా సేవలందించాడు. ఈ టోర్నీలో పాకిస్థాన్ బౌలర్లు అంచనాలను అందుకోకపోవడంతో మోర్కెల్ బౌలింగ్ కోచ్ పదవికి రాజీనామా చేశాడు.

ప్రస్తుత టీమిండియా కోచింగ్ బలం

  • హెడ్ కోచ్: గౌతమ్ గంభీర్ 
  • బౌలింగ్ కోచ్: మోర్నీ మోర్కెల్
  • అసిస్టెంట్ కోచ్‌లు: అభిషేక్ నాయర్, ర్యాన్ టెన్ డెస్కాటే
  • ఫీల్డింగ్ కోచ్: దిలీప్