Champions Trophy 2025: స్వదేశానికి మోర్కెల్: అర్ధాంతరంగా తప్పుకున్న టీమిండియా బౌలింగ్ కోచ్

Champions Trophy 2025: స్వదేశానికి మోర్కెల్: అర్ధాంతరంగా తప్పుకున్న టీమిండియా బౌలింగ్ కోచ్

ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్ కు ఊహించని షాక్ తగిలింది. తొలి మ్యాచ్ కు ముందు టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ స్వదేశానికి బయలుదేరాడు. మోర్కెల్ తండ్రి ఆల్బర్ట్ మరణించడంతో అతను సౌతాఫ్రికా వెళ్లాల్సి వచ్చిందట. సోమవారం (ఫిబ్రవరి 17) జరిగిన ప్రాక్టీస్ సెషన్ కు మోర్కెల్ దూరమయ్యాడు. మోర్కెల్ తిరిగి జట్టులోకి ఎప్పుడు చేరాతాడో స్పష్టత లేదు. బుమ్రా ఈ మెగా టోర్నీకి దూరం కావడంతో టీమిండియా బౌలింగ్ బలహీనంగా మారింది. గాయం నుంచి కోలుకున్న షమీ ఎంతవరకు రాణిస్తాడనేది అనుమానంగా మారింది. 

అనుభవం లేని అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా ఛాంపియన్స్ ట్రోఫీలో సత్తా చాటగలరా అనే సందేహాలు ఉన్నాయి. స్పిన్ విభాగం పటిష్టంగా కనిపిస్తున్నా.. ఫాస్ట్ బౌలింగ్ లో మాత్రం బలహీనంగా ఉంది. ఈ నేపథ్యంలో మోర్కెల్ దూరం కావడం భారత జట్టుకు ఎదురు దెబ్బె. బంగ్లాదేశ్ తో గురువారం (ఫిబ్రవరి 20) జరగబోయే మ్యాచ్ తో భారత్ టోర్నీ తొలి మ్యాచ్ ఆడనుంది. ఆదివారం (ఫిబ్రవరి 23) దుబాయ్‌లో పాకిస్తాన్ తో హై-వోల్టేజ్ మ్యాచ్.. మార్చి 2న ఇదే వేదికపై న్యూజిలాండ్‌తో భారత్ తలపడనుంది.

ALSO READ | Champions Trophy 2025: బంగ్లాతో తొలి పోరు.. హర్షిత్ రాణా ఔట్.. టీమిండియా తుది జట్టు ఇదే!

టాప్ 8 జట్లు ఆడే ఈ టోర్నీ ఫిబ్రవరి 19 నుండి మార్చి 9 వరకు జరుగుతుంది. పాకిస్తాన్‌,దుబాయ్ వేదికలుగా ఈ మెగా టోర్నీ జరగనుంది. పాకిస్థాన్ లోని లాహోర్, కరాచీ, రావల్పిండి ఎనిమిది జట్లు ఆడే ఈ టోర్నమెంట్‌లో మొత్తం 10 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. పాకిస్తాన్‌,దుబాయ్ వేదికలుగా ఈ మెగా టోర్నీ జరగనుంది. భారత జట్టు పాల్గొనే మ్యాచ్‌లు దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతాయి.