![ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు ఇసుక బుకింగ్](https://static.v6velugu.com/uploads/2025/02/morning-10-am-to-evening-5pm-sand-booking-timeingstgmdc-orders-issued_jgGP7XsJqf.jpg)
- టీజీఎండీసీ ఉత్తర్వులు
హైదరాబాద్, వెలుగు: ఇసుక బుకింగ్ సమయాల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో ఇసుక బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించింది. ఈ మేరకు టీజీఎండీసీ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
అదే సమయంలో ఇసుక రీచ్‌ల నుంచి మూడు రెట్లు ఎక్కువగా ఇసుక తీయాలని ఆదేశించింది. స్టాక్ యార్డ్‌లలో టిప్పర్లు తప్ప వేరే ఇతర వాహనాలను అనుమతించకూడదని స్పష్టం చేసింది. ఎంట్రీకి, ఎగ్జిట్‌కు ఒకే రూట్ ఉండాలని, టిప్పర్‌కు లోడింగ్ బాడీ లెవెల్ కంటే ఎక్కువగా ఉండకూడదని తెలిపింది. ఈ నిబంధనలను ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని, ఒప్పందాలను రద్దు చేస్తామని హెచ్చరించింది.