
సిద్దిపేట జిల్లా కేంద్రంతోపాటు చుట్టు పక్కల గ్రామాలను బుధవారం ఉదయం పొగ మంచు కమ్మేసింది. 9 గంటల వరకు మంచు విడువలేదు. వాహనదారులు, చిరువ్యాపారులు ఇబ్బంది పడ్డారు. లైట్లు వేసుకుని నెమ్మదిగా వెళ్లాల్సి వచ్చింది. చలికి జనం వణికిపోతున్నారు.
– వెలుగు ఫొటోగ్రాఫర్, సిద్దిపేట