
చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ... చెన్నూరు మున్సిపాల్టీలోని పలు వార్డుల్లో ఈ రోజు ( అక్టోబర్ 20) మార్నింగ్ వాక్ చేశారు. ప్రజలతో కలిసి నడుస్తూ.. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి హామీ ఇచ్చారు. కాంగ్రెస్ కార్యకర్త పెండ్యాల శ్రీకాంత్ తండ్రి మృతి చెందడంతో వారి ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించారు.