రూ.75 కోట్ల విలువైన సొసైటీ స్థలం తనఖా

రూ.75 కోట్ల విలువైన సొసైటీ స్థలం తనఖా
  •      ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ అరెస్ట్ 

గచ్చిబౌలి, వెలుగు :  సాఫ్ట్​వేర్​ఇంజనీర్స్​ఎంప్లాయీస్ హౌసింగ్ అండ్​వెల్ఫేర్​అసోసియేషన్ కు చెందిన రూ. 75 కోట్ల విలువైన సొసైటీ స్థలాన్ని తనఖా పెట్టిన ప్రెసిడెంట్, జనరల్​సెక్రటరీ అరెస్ట్ అయ్యారు. సైబరాబాద్​ఎకనామిక్​అఫెన్స్​ వింగ్ ఇన్​స్పెక్టర్​వెంకటేశ్వర్లు​తెలిపిన ప్రకారం.. సిటీలోని కొందరు సాఫ్ట్​వేర్​ఎంప్లాయీస్ కలిసి సొసైటీని ఏర్పాటు చేసుకున్నారు.  సొసైటీ ప్రెసిడెంట్​గా జూబీహిల్స్​కు చెందిన అశోక్​రావు, జనరల్​సెక్రటరీగా గచ్చిబౌలికి చెందిన చావా ఉదయ్​కుమార్, 345 మంది సభ్యులు ఉన్నారు.  

2007లో ఉస్మాన్​నగర్​లో 6 ఎకరాలు, దాని పక్కన మరో 5 ఎకరాలు భూమి కొన్నారు. ముందుగా 5 ఎకరాల్లో 240 అపార్ట్​మెంట్​ఫ్లాట్లు, 15 విల్లాలు నిర్మించి 2016లో పంపిణీ చేశారు.  2018లో సొసైటీ ఎన్నికలు జరగగా..  అనంతరం ఎన్నికలు, జనరల్​బాడీ మీటింగ్​నిర్వహించలేదు. ఇటీవల 6 ఎకరాల స్థలంలో నిర్మాణాలు చేపట్టేందుకు సొసైటీ సభ్యులు నిర్ణయించుకున్నారు.

 గత ఏప్రిల్16న సొసైటీకి చెందిన సభ్యుడు భూమికి ఈసీ (ఎన్​కంబరెన్స్​ సర్టిఫికెట్) తీసుకున్నారు. దీంతో ప్రెసిడెంట్​అశోక్​రావు, జనరల్​సెక్రటరీ ఉదయ్​కుమార్​బాగోతం బయటపడింది. ఇద్దరూ కలిసి 3 ఎకరాల స్థలాన్ని 2019 ఆగస్టులో మార్ట్​గేజ్​డీడ్​చేయించారు. ఆ స్థలంపై 1.5 కోట్లు తీసుకున్నారు. దీంతో సొసైటీ సభ్యులు సైబరాబాద్​ పోలీసులకు కంప్లయింట్ చేశారు.  కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా అశోక్ రావు, ఉదయ్​ కుమార్​ను అరెస్ట్​చేశారు.