రష్యాలోని మాస్కోలోని క్రోకస్ సిటీ హాల్‌పై ఉగ్రవాదులు దాడులు చేసిన ఘటన తెలిసిందే. దీని పై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పందిస్తూ ఉగ్రవాద దాడి రాడికల్ ఇస్లామిస్టులు చేశారని అన్నారు. వ్రవాద దాడి తర్వాత తీసుకున్న చర్యలపై పుతిన్ మాట్లాడారు. ఘటన ఏ ఉగ్రవాద సంస్థ చేయించిందనేది తెలియాల్సి ఉందన్నారు. తీవ్రవాద, ఇస్లామిక్ సంస్థలు రష్యాను కొట్టడానికి ప్రయత్నిస్తున్నాయని చెప్పారు.
క్రోకస్‌లో దాడి చేసిన తర్వాత ఉగ్రవాదులు ఉక్రెయిన్‌కు వావెళ్లడానికి ప్రయత్నించారని అక్కడికే ఎందుకు వెళ్లడానికి ట్రై చేశారనేది తెలియాల్సి ఉందన్నారు. రష్యాపై దాడి చేయడం ఎవరికి లాభం చేకూరుస్తుందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు.
ఉగ్రవాదులను శిక్షించాలని ప్రజలంతా అభిప్రాయపడుతున్నారని కానీ ఉగ్రవాద దాడిపై దర్యాప్తు వృత్తిపరంగా, నిష్పక్షపాతంగా, రాజకీయ పక్షపాతం లేకుండా అత్యున్నత స్థాయిలో విచారణ జరుగుతుందని చెప్పారు.