మాస్కో అప్డేట్స్: 60 మంది మృతి..145 మందికి గాయాలు..

రష్యా రాజధాని మాస్కోలో ఉగ్రాదాడి కలకలం రేపుతుంది. శుక్రవారం రాత్రి మాస్కోలోని ఓ కాన్సర్ట్‌ హాల్లో­కి ప్రవేశించి తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 60 మందికిపైగా మృతి చెందగా, 145 మంది గాయపడినట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అక్కడి అధికారులు అంచనా వేస్తున్నారు.  
 
ఎలా జరిగిందంటే.. 

మాస్కో శివారులోని క్రోకస్‌ సిటీ కాన్సర్ట్‌ హాల్‌లో ప్రముఖ రష్యన్‌ రాక్‌ బ్యాండ్‌ ‘ఫిక్‌నిక్‌’ సంగీత కార్యక్రమం జరుగుతోంది. ఆ సమయంలో ఆర్మీ డ్రెస్సుల్లో కాన్సర్ట్‌హాల్‌లోకి వచ్చిన ఐదుగురు ఉగ్రవాదులు తుపాకులతో కాల్పులు జరిపారు. బాంబుల వర్షం కురిపించారు. 

అక్కడ ఉన్న వారు భయబ్రాంతులకు గురై పోలీసులకు సమాచారం ఇచ్చారు.  సమాచారం అందుకున్న పోలీసులు భారీ ఎత్తున అక్కడికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. హాల్‌లో చిక్కకున్న పలువురిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.