Health Tips: దోమలను తరిమి కొట్టడానికి .. వంటింటి చిట్కాలు ఇవే..

Health Tips: దోమలను తరిమి కొట్టడానికి .. వంటింటి చిట్కాలు ఇవే..

జోరుగా వానలు పడుతున్నాయి.  రాత్రిపూట అలా కునుకు పడితే చాలు.. చెవు దగ్గర గుయ్​ మంటూ దోమలు నానా హంగామా చేస్తాయి. ఇక అవి కాటేశాయా.. మన పని అంతే..జ్వరం.. తలనొప్పి.. వేధిస్తాయి.  మందు బిళ్లలు మింగి మళ్లీ మామూలు స్థాయికి చేరేందుకు ఓ వారం... పది రోజులు పడుతుంది.  ఒక్కోసారి ఇంకా ఎక్కువ సమయం పడుతుంది.  ఇంతటి ప్రమాదకరమైన జీవి ఇంట్లో తిష్ఠ వేస్తే  దానిని వంటింటి చిట్కాలతో ఎలా తరిమికొట్టాలో తెలుసుకుందాం. . . 

వర్షాలు జోరుగా కురుస్తుండటంతో  దోమలు బెదడ మరింత చికాకుకు పెట్టిస్తాయి. దోమల బెడద పెరిగితే రాత్రి నిద్రకు కూడా భంగం కలుగుతుంది. కాబట్టి ఇంట్లో దోమలను తరిమికొట్టడం చాలా అవసరం. కానీ మార్కెట్‌లో లభించే దోమల నివారణలు నుంచి వెలువడే పొగ, వాసనను చాలా మంది తట్టుకోలేరు. ఇలాంటి వారు దోమలను సహజపద్ధతుల్లో తరిమికొట్టే మార్గాల గురించి తెలుసుకోవాలి. 

నిమ్మకాయ, యూకలిప్టస్ నూనె : లెమన్ యూకలిప్టస్ ఆయిల్ దోమల సహజ వికర్షకాలలో ఒకటి. యూకలిప్టస్ నూనెలో నిమ్మకాయ రసం కలిపి ఈ మిశ్రమాన్ని తయారు చేసుకోవచ్చు. 3 ఏళ్ల కంటే తక్కువ వయస్సు పిల్లలకు ఈ మిశ్రమాన్ని ఉపయోగించకూడదు.

 లావెండర్ పువ్వుల పొడి:  దోమలను తిప్పికొట్టగల సువాసన, నూనెను ఉత్పత్తి చేస్తాయి. లావెండర్ అనాల్జెసిక్, యాంటీ ఫంగల్, యాంటి సెప్టిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది దోమల బెడదను అరికట్టడమే కాకుండా చర్మాన్ని సున్నితంగా చేస్తుంది.

దాల్చిన చెక్క నూనె  : దాల్చిన చెక్క నూనె దోమల గుడ్లను నాశనం చేస్తుంది. దోమలకు రెపలెంట్ గా పనిచేస్తుంది. 4 ఔన్సుల నీటికి 1/4 టీస్పూన్ ఈ నూనె కలిపి మిశ్రమాన్ని చర్మం, దుస్తులు, ఇంటి పరిసరాల్లో పిచికారీ చేయవచ్చు.

గ్రీక్ క్యాట్మెంట్ ఆయిల్ : పుదీనా కుటుంబానికి చెందిన క్యాట్నిప్ నె పెటా పర్నాసికా దోమలను దూరం చేస్తుంది. ఈ మొక్కల నూనె 2 నుంచి 3 గంటల వరకు దోమలను సమర్థవంతంగా తిప్పికొట్టగలవు.

థైమ్ ఆయిల్ :  మలేరియా దోమలను తరిమికొట్టడానికి థైమ్ ఆయిల్ ఉత్తమమైనది. థైమ్ ఆకులను కాల్చడం వల్ల 60 నుంచి 90 నిమిషాల వరకు దోమలు, కీటకాల బెడద ఉండదు. ఓ టీ  స్పూన్ ఆలివ్ లేదా జోజోబా ఆయిల్ కు 4 చుక్కల థైమ్ ఆయిల్ కలపండి.

సోయాబీన్ నూనె : సోయాబీన్ ఆధారిత ఉత్పత్తులు దోమల నుంచి దీర్ఘకాలిక రక్షణను అందిస్తాయి. సోయాబీన్ నూనెతో పాటు, లెమన్రాస్ నూనెను కూడా దోమ కాటు నుంచి రక్షించడానికి ఉపయోగపడుతుంది.

 సిట్రోనెల్లా :  సిట్రోనెల్లా అనేది దోమలను - వికర్షించే సహజమైన నూనె. సిట్రోనెల్లా కొవ్వొత్తులు ప్రభావతంగా పనిచేస్తాయి

టీ ట్రీ ఆయిల్:   టీ ట్రీ ఆయిల్ లేదా మెలలూకా ఆయిల్..  క్రిమినాశక, యాంటీమైక్రోబయల్, యాంటీ  ఇన్ఫ్లమేటరీ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది.

వేపనూనె : వేప నూనె దోమల వికర్షకంగా సహజ ప్రత్యామ్నాయం. 50 నుంచి 100 మిల్లీలీటర్ల వేపనూనెకు నీటిని కలిపి ఈ మిశ్రమాన్ని తయారు చేసుకోవచ్చు.

కర్పూరం వెలిగిస్తే: దోమల వాసనతో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. బదులుగా, ఇంట్లో కర్పూరాన్ని వెలిగించవచ్చు. కర్పూరం కాల్చడం వల్ల ఇంట్లో పెద్దగా పొగ రాదు. ఈ పొగకు దోమలు పారిపోతాయ్‌. పైగా శ్వాసకోశ సమస్యలు ఉన్నవారికి కూడా కర్పూరం ఎంతో మేలు చేస్తుంది.

లేత రంగు దుస్తులు : ఇలాంటి వాటిని  ధరించడం ద్వారా కూడా దోమలను మోసం చేయవచ్చు. ముదురు రంగులు దోమలను ఆకర్షిస్తాయి. దోమలు శరీరంలో బహిర్గతమైన భాగాలను ఎక్కువగా కుడతాయి. కాబట్టి లేత రంగు దుస్తులు ధరించడం మంచిది. 

ఇంటి చుట్టూ మొక్కలు ఉంటే దోమల బెడద మరింత పెరుగుతుంది. కాబట్టి సకాలంలో కలుపు మొక్కలను తొలగించడం మంచిది. ఇంటి నాలుగు వైపులా ఎక్కడా నీరు చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

Also Read:-వానాకాలంలో కారం కారంగా.. వెరైటీ కారాలు ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు..!