
ఎండలు ముదిరాయి. రాత్రివేళ ఓ పక్క ఉక్కపోత.. మరోపక్క దోమలు వేధిస్తున్నాయి. గాలి కోసం తలుపు తీస్తే చాలు చెవు దగ్గర గుయ్ మంటూ దోమలు నానా హంగామా చేస్తాయి. ఇక అవి కాటేశాయా.. మన పని అంతే..జ్వరం.. తలనొప్పి.. వేధిస్తాయి. మందు బిళ్లలు మింగి మళ్లీ మామూలు స్థాయికి చేరేందుకు ఓ వారం... పది రోజులు పడుతుంది. ఒక్కోసారి ఇంకా ఎక్కువ సమయం పడుతుంది. ఇంతటి ప్రమాదకరమైన జీవి ఇంట్లో తిష్ఠ వేస్తే .. దానిని వంటింటి చిట్కాలతో ఎలా తరిమికొట్టాలో తెలుసుకుందాం. . .
కిచెన్ లో ఉండే కొన్ని పదార్థాలతో దోమల మందును తయారుచేసుకోవచ్చు. నిమ్మకాయ, లవంగం, వేప నూనె, వెల్లుల్లి వంటి పదార్థాలతో దోమలు ఇంట్లో ఉండకుండా తరిమేయవచ్చు. అతి తక్కువ ఖర్చుతో చాలా తేలికగా దోమలను ఇంటినుంచి తరిమేయచ్చు. ఇప్పుడు దోమల స్ప్రేను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. . .
నిమ్మకాయలు... లవంగాలతో దోమల స్ప్రే
- నిమ్మకాయ : 1
- లవంగాలు : 1012
- నీరు: ఒక కప్పు
- స్ప్రే బాటిల్ : 1
తయారీ విధానం: ముందుగా స్టవ్‌పై ఒక గిన్నెలో నీళ్లను మరిగించాలి. మరిగే నీటిలో లవంగాలను 10 నిమిషాల పాటు ఉడికించాలి. ఆ తరువాత దానిని చల్లార్చి అందులో నిమ్మరసాన్ని కలపండి. తరువాత ఈ మిశ్రమాన్ని స్ప్రే బాటిలో కి తీసుకొని తలుపులు.. గోడలు పై స్ప్రే చేయండి. శరీరానికి కూడా రాసుకోవచ్చు. దీని వాసనకు దోమలు ఆమడ దూరం పరిగెడతాయి.
Also Read : కొత్త సంవత్సరం: విశ్వావసు నామ సంవత్సరం
వెల్లుల్లితో.. దోమల మందు తయారీకి కావలసినవి
- వెల్లుల్లి రెబ్బలు : 4
- లవంగాలు: 5
- నీరు: ఒక కప్పు
- స్ప్రే బాటిల్ : ఒకటి
తయారీ విధానం: వెల్లుల్లి రెబ్బలను పేస్ట్ చేసి ఒక కప్పు నీటిలో ఐదు నిమిషాలు మరగించాలి. నీళ్లు మరిగేటప్పుడు అందులో లవంగాలు వేయాలి. ఈ మిశ్రమాన్ని చల్చార్చిన తరువాత వడకట్టి స్ప్రే బాటిలోకి తీసుకోవాలి. దీనిని దోమలు ఎక్కువుగా ఉండే ప్రదేశాల్లో స్ప్రే చేస్తే ఈ ఘాటుకు పారిపోతాయి. వెల్లుల్లిలో సల్ఫర్ సమ్మేళనాలు ఉంటాయి. ఈ ఘాటుకు దోమలు అసలు ఉండవు.
ఇప్పుడు అందరూ మస్కిటో కాయిల్స్ .. రసాయనాలతో తయారు చేసిన క్రిమి సంహారక మందులు వాడుతున్నారు. వీటి వల్ల చిన్నపిల్లల్లో ఆస్తమా వంటి శ్వాస సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. పిల్లలు పొరపాటున కాయిల్ని మింగితే పాయిజన్ అవుతుంది. కాలుతున్నప్పుడు వాటిని ముట్టుకుంటే గాయాలు అవుతాయి. వేపరైజర్ నుంచి వచ్చే రసాయనాలు కూడా పిల్లల్లో ఆస్తమా, తలనొప్పికి కారణమవుతాయి.. అలా కాకుండా ఇంట్లో తయారు చేసే దోమల మందును వాడితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు కదా మరి..!