నల్గొండ జిల్లాలో కేఎఫ్​బీర్లు తాగుతున్నారా..? ఈ ముచ్చట తెలుసా..?

నల్గొండ జిల్లాలో కేఎఫ్​బీర్లు తాగుతున్నారా..? ఈ ముచ్చట తెలుసా..?

సంస్థాన్ నారాయణపురం వెలుగు : కింగ్ ఫిషర్ బీర్ లో నాచు కనిపించడంతో కొనుగోలుదారుడు షాక్​కు గురయ్యాడు. ఈ ఘటన -సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. మండల కేంద్రంలోని మహంకాళి వైన్స్ లో శనివారం ఓ వ్యక్తి కింగ్ ఫిషర్ కంపెనీకి చెందిన ఆరు బీర్లు కొనుగోలు చేశాడు. వాటిని ఇంటికి తీసుకెళ్లి తాగేందుకు సిద్ధం కాగా, ఒక బీరు సీసా పూర్తిగా నాచుతో నిండి ఉంది.

దీంతో కంగుతిన్న కొనుగోలుదారుడు వెంటనే వైన్స్ వద్దకు తీసుకెళ్లి చూపించాడు. ఈ బీరు తమ వద్ద తీసుకున్నట్లు గ్యారంటీ ఏంటని వైన్స్ నిర్వాహకులు ప్రశ్నించడంతో కస్టమర్ షాక్​గురయ్యాడు. అంతేకాకుండా దీనిపై ఎక్సైజ్ అధికారులను వివరణ కోరగా, వారు కూడా ఇదే తరహా సమాధానం ఇవ్వడంతో కస్టమర్లు ఎవరికి చెప్పాలో తెలియని పరిస్థితి నెలకొంది.

ఎక్సైజ్ అధికారుల నిర్లక్ష్యంతోనే ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయని మద్యం ప్రియులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైన్స్ యజమానులకు, ఎక్సైజ్ అధికారులు మామూలు మత్తుకు అలవాటు పడి ఇలా సహకరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి ఎక్సైజ్ అధికారులు, వైన్స్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.