
బడ్జెట్ ఫ్రెండ్లీ ఆఫర్లను అందించే టెలికం ఆపరేటర్లలో BSNL బెస్ట్ వన్. ఎప్పుడు తన కస్టమర్లకు తక్కువ ధరలో, వ్యాల్యుబుల్ ఆఫర్లను అందిస్తుంది. ప్రభుత్వ టెలికం సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్.. ప్రైవేట్ టెలికం ఆపరేటర్లకంటే చీపెస్ట్ రీచార్జ్ ప్లాన్లను ఆఫర్ చేస్తోంది. దేశవ్యాప్తంగా తక్కువ ఖర్చుతో రీచార్జులను కోరుకునే వారికి ఇది మంచి ఎంపిక.
మీరు అతితక్కువ ధరకు ఎక్కువ రోజువారీ ఇంటర్నెట్ డేటా కోసం ఎదురు చూస్తున్నవారికి BSNL మంచి ఆఫర్లను అందిస్తోంది. అందులో రూ. 151 డేటా ప్లాన్ ఒకటి. డబ్బు ఖర్చు చేయకుండా కనెక్ట్ అయి ఉండాలనుకునేవారికోసం బడ్జెట్ అనుకూలమైన ప్లాన్ ఇది. ఈ ప్లాన్ ద్వారా 30 రోజులపాటు 40 GB డేటా అన్ ఇంటరప్టెడ్ బ్రౌజింగ్ అనుభవం అందిస్తుంది. అలాగే 30రోజుల పాటు తరచు రీచార్జ్ లేకుండా మొబైల్ కనెక్ట్ అయి ఉంటుంది.
BSNL రూ.198 రీచార్జ్ ప్లాన్..
- వ్యాలిడిటీ : 40 రోజులు
- రోజువారీ డేటా: 2GB
- FUP తర్వాత వేగం: 40 Kbps
- ఇది డేటా ఓచర్ మాత్రమే. కాల్స్ , SMS ఉండవు.
స్థిరమైన రోజువారీ డేటా వినియోగం అవసరమయ్యే కస్టమర్లకు రూ.198 ప్లాన్ బెస్ట్ వన్. రోజు వారీ డేటా 2GB పూర్తి చేసిన తర్వాత ఇంటర్నెట్ వేగం 40 Kbpsకి తగ్గించబడింది. ఈ ప్లాన్ ద్వారా అదనపు ఛార్జీలు లేకుండా ప్రైమరీ కనెక్టివిటీని పొందవచ్చు.
BSNL రూ.411ప్లాన్:
- వ్యాలిడిటీ : 90 రోజులు
- మొత్తం డేటా: 180GB (రోజుకు 2GB)
- ఇది కూడా డేటా వోచర్ మాత్రమే. కాల్స్, SMS లు ఉండవు
ఈ రూ.411 ప్లాన్ అత్యంత పొదుపైన దీర్ఘకాలిక ప్లాన్. 90 రోజుల పాటు ప్రతిరోజూ 2GB డేటాను అందిస్తుంది. అదనపు ఖర్చు లేకుండా స్థిరమైన డేటా సరఫరా అవసరమయ్యే కస్టమర్లకు మంచి ఎంపిక.
షార్ట్ టర్మ్ లేదా లాంగ్ టర్మ్ కనెక్టివిటీ కోసం తక్కువ ధరలో కనెక్ట్ అయి ఉండే రీచార్జ్ ప్లాన్లకోసం ఎదురు చూస్తున్న BSNL కస్టమర్లుకు బెస్ట్ ఎకనామికల్ ప్లాన్లు ఇవి.