ప్రతివారం లాగే ఈ వారం కూడా అదిరిపోయే సినిమాలు థియేటర్స్కి రానున్నాయి. ఈ వారం ఫిబ్రవరి 6 మరియు 7 తేదీలలో ఇంట్రెస్టింగ్ సినిమాలు ఆడియన్స్ ముందుకు వస్తున్నాయి. అందులో లవ్, దేశభక్తి, యాక్షన్, క్రైమ్ జోనర్లో సినిమాలు వస్తుండటం ఆసక్తిని పెంచుతున్నాయి. మరి ఆ సినిమాలేంటీ? వాటి జోనర్స్ ఏంటీ? ఎప్పుడు రానున్నాయి ఓ లుక్కేద్దాం.
తండేల్ మూవీ:
అక్కినేని నాగ చైతన్య, సహజ నటి సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ కమ్ దేశభక్తి మూవీ తండేల్. ఈ మూవీ శుక్రవారం (ఫిబ్రవరి 7న) ప్రపంచవ్యాపంగా విడుదల కానుంది. ఇటీవలే రిలీజ్ చేసిన సాంగ్స్ వంద మిలియన్ల వ్యూస్తో దూసుకెళ్తున్నాయి. టీజర్, ట్రైలర్ విజవల్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి.
Also Raed : 'క' భారీ సక్సెస్.. కొత్త సినిమా ప్రకటించిన కిరణ్ అబ్బవరం.. టైటిల్ అనౌన్స్
తండేల్ నిజజీవిత కథ:
2018లో శ్రీకాకుళానికి చెందిన మత్య్సకారులు గుజరాత్‍లో చేపల వేటకు దిగి అనుకోకుండా సముద్రంలో పాకిస్థాన్ హద్దులకు వెళ్లారు. అక్కడ పాక్ సైన్యానికి పట్టుబడ్డారు. పాక్ జైలులో కొన్ని నెలల పాటు చిత్ర హింసలు అనుభవించారు. ఆ తర్వాత మళ్లీ భారత్‍కు చేరారు. వారిలో మత్స్యకారుడు రాజు కూడా ఒకరు. అతడి నిజ జీవిత కథ ఆధారంగానే తండేల్ చిత్రం రూపొందింది.
పట్టుదల మూవీ:
తమిళ స్టార్ హీరో అజిత్ లేటెస్ట్ మోస్ట్ వెయిటింగ్ మూవీ పట్టుదల. తమిళంలో విదాముయార్చి. మాగిజ్ తిరుమేని దర్శకత్వంలో రూపొందిన విదాముయార్చి మూవీ గురువారం (ఫిబ్రవరి 6న) విడుదల కానుంది. లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది.
అజర్ బైజాన్ నేపథ్యంగా సాగే ఈ యాక్షన్ థ్రిల్లర్ లో అజిత్ రెండు కోణాల్లో కనిపించనున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ యాక్షన్ సీన్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. అయితే, ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అవ్వాల్సింది. కానీ, అనివార్య కారణాల వల్ల పోస్ట్ ఫోన్ చేసుకోవాల్సి వచ్చింది.
పట్టుదల సినిమాకు అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించారు. యాక్షన్ కింగ్ అర్జున్, బ్యూటిఫుల్ హీరోయిన్ రెజీనా కసాండ్రా నెగిటివ్ షేడ్స్ ఉన్నపాత్రల్లో నటిస్తున్నారు. ఓం ప్రకాష్ ఫోటోగ్రఫీ డైరెక్టర్ గా పని చేస్తున్నాడు.
ఒక పథకం ప్రకారం:
స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ తమ్ముడు సాయి రామ్ శంకర్ తన కొత్త సినిమాతో వస్తున్నాడు. ‘ఒక పథకం ప్రకారం’ (Oka Pathakam Prakaaram) అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా ఫిబ్రవరి 7న థియేటర్స్కు రానుంది. క్రైమ్, థ్రిల్లర్ జోనర్లో రానున్న ఈ సినిమా టీజర్, ట్రైలర్ విజువల్స్ ఆసక్తిని పెంచేశాయి.
అయితే, ఇందులో నటించే ముఖ్య పాత్రల్లో విలన్ ఎవరన్నది సినిమా చివరి వరకు సస్పెన్స్గా ఉండనున్నట్లు మేకర్స్ చెబుతూ వస్తున్నారు. మరి ఇందులో హీరో సాయి రామ్ శంకర్ హీరోనా... విలనా...?, మంచోడా... రాక్షసుడా...?, లాయరా... హంతకుడా...? అనేది ప్రేక్షకులే చూసి నిర్దారించాలి.
లవ్యాపా (Loveyapa):
జునైద్ ఖాన్ మరియు ఖుషీ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ లవ్యాపా (Loveyapa). అద్వైత్ చందన్ దర్శకత్వంలో తెరకెక్కిన హిందీ రొమాంటిక్ కామెడీ మూవీ ఇది. ఈ చిత్రం తమిళ చిత్రం లవ్ టుడే సినిమాకి హిందీ రీమేక్ గా తెరకెక్కింది. ఈ సినిమా ఫిబ్రవరి 7న థియేటర్లలో విడుదల కానుంది. థియేటర్లలో కొత్త జోడిని చూడటానికి అభిమానులు చాలా ఉత్సాహంగా ఉన్నారు.
బాదాస్ రవి కుమార్:
హిమేష్ రేష్మియా రూపొందించిన లేటెస్ట్ హిందీ యాక్షన్ మ్యూజికల్ 'బాదాస్ రవి కుమార్'. ఈ మూవీ ఫిబ్రవరి 7, 2025న విడుదల కానుంది. ఈ చిత్రంలో ప్రభుదేవా, కీర్తి కుల్హారి మరియు సన్నీ లియోన్ అతిధి పాత్రతో కనిపించనున్నారు.