
హైదరాబాద్, వెలుగు: కోర్టు కేసుల్లో ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వానికి చెందినవే ఉన్నాయని.. ప్రభుత్వమే ఒక పెద్ద లిటిగెంట్‌గా ఉందని హైకోర్టు ఫైర్అయింది. ‘‘స్టేట్ లెవెల్ ఆఫీసర్ల స్థాయిలో సెటిల్ చేయాల్సిన వివాదాల్ని పట్టించుకోకపోవడంతో వాటిపై కోర్టుల్లో కేసులు దాఖలైతున్నయి” అని వ్యాఖ్యానించింది. ఆఫీసర్ల స్థాయిలో పరిష్కారమయ్యేవాటిని కోర్టు కేసులుగా దాఖ లు కాకుండా ఒక లిటిగేషన్ పాలసీని తయారు చేయాలని సూచించింది. కొన్ని రాష్ట్రాల్లో లిటిగేషన్ పాలసీ ఉందని, వాటి ఫలితాలు కూడా బాగున్నాయని తెలిపింది. రూ.3.45 లక్షల మెడికల్ బిల్లుకు రూ.లక్ష మాత్రమే మంజూరు చేయడంపై ఒక జిల్లా కోర్టు మాజీ ఎంప్లాయ్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గురువారం చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్‌కుమా ర్‌లతో కూడిన డివిజన్ బెంచ్ విచారించి పై కామెంట్లు చేసింది.