బైక్ పై వెళుతుంటే.. మంజా దారంతో గొంతులు తెగుతున్నాయి..!

బైక్ పై వెళుతుంటే.. మంజా దారంతో గొంతులు తెగుతున్నాయి..!

కొత్త సంవత్సరం వేడుకల సమయంలో ..సంక్రాంతి పండుగ సమయంలో.. చాలా మంది పిల్లలు.. పెద్దలు గాలి పటాలు ఎగురవేస్తారు. పిల్ల.. పెద్ద అనే తేడా లేకుండా కైట్స్ గాల్లో ఎగురవేస్తూ ఎంజాయి చేస్తుంటారు.  కొంతమంది మరీ పోటీలు పెట్టుకుంటారు.  ఇలా గాలిపటాలు గాల్లో ఎత్తులో ఎగరవేయడానికి మాంజా థ్రెడ్ ఉపయోగిస్తారు.  రోడ్లపై రెళ్లే వారికి ఈ మాంజా చుట్టుకుందా.. ఇక అంతే.. చాలా డేంజర్ పరిస్థితిలోకి వెళతారు.

 తాజాగా   రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణానికి చెందిన  రంగనాథ్ తన భార్యతో కలిసి బైకు పై ముచ్చింతల్ దేవాలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో పతంగి మాంజ రంగనాథ్ గొంతుకు తాకి గాయమయ్యింది.  దాన్ని తొలగించే ప్రయత్నం చేసిన రంగనాథ్ భార్య చేతులకు గాయాలయ్యాయి. భార్య మంజా దారాన్ని ఆపడం వల్లే తాను గాయంతో బయటపడ్డానని, లేకపోతే ప్రమాదం మరింత తీవ్రంగా ఉండేదాని, పిల్లలు ఇలాంటి ప్రమాదకరమైన చైనా మంజాలు వాడొద్దని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో  పతంగి మాంజా గొంతుకు కోసుకుని వ్యక్తి సీరియస్  అయింది. చండ్రుగొండ మండలం గుర్రాయిగూడెం గ్రామానికి చెందిన ఏరువ కృష్ణారావు కొత్తగూడెం టౌన్ లో ప్రైవేటు జాబ్ చేస్తున్నాడు. బుధవారం ( జనవరి 1)  అతడు బైక్​పై డ్యూటీకి వెళ్తుండగా.. కొత్తగూడెం టౌన్ రామవరం ఏరియాలో పతంగి మాంజా మెడకు తగలడంతో గొంతు కోసుకుపోయింది. దీంతో తీవ్ర రక్తస్రావమై కింద పడిన అతడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైనట్రీట్ మెంట్ కోసం ఖమ్మం పంపించారు.  అక్కడినుంచి అతడిని కుటుంబసభ్యులు హైదరాబాద్ తీసుకెళ్లారు.