లా ఎడ్యుకేషన్​ ఎంతో ఉన్నతమైనది

  • ప్రతి ఒక్కరూ కమ్యూనికేషన్​ డెవలప్ ​చేసుకోవాలి
  • కాకా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విద్యా సంస్థల కరస్పాండెంట్ డాక్టర్ సరోజా వివేక్

ముషీరాబాద్, వెలుగు: లా ఎడ్యుకేషన్​ఎంతో ఉన్నతమైనదని కాకా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విద్యా సంస్థల కరస్పాండెంట్ డాక్టర్ సరోజా వివేక్ చెప్పారు. తమ లా కాలేజీలో మెరుగైన విద్యను అందిస్తున్నట్లు తెలిపారు. లా స్టూడెంట్లకు ఫ్రీగా స్టడీ మెటీరియల్​ను ఇస్తున్నామని, సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతిఒక్క స్టూడెంట్​కమ్యూనికేషన్ ను డెవలప్ చేసుకోవాలని చెప్పారు. 

బుధవారం బాగ్ లింగంపల్లిలోని కాలేజీలో ఫస్ట్​ ఇయర్ ​లా స్టూడెంట్లకు ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఓయూ లా కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డాక్టర్ రాధిక యాదవ్, సిటీ సివిల్ జడ్జి సాయికుమార్, సరోజా వివేక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ విద్యాసంస్థల విశిష్టత, కాకా వెంకటస్వామి ఆశయాలను గుర్తుచేశారు. న్యాయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని చెప్పారు. 

న్యాయవ్యవస్థలో వస్తున్న మార్పులను గమనిస్తూ విద్యార్థులు నిరంతరం కొత్త విషయాల కోసం అన్వేషణ చేయాలన్నారు. కార్యక్రమంలో అంబేద్కర్ కాలేజీ డైరెక్టర్ విష్ణుప్రియ, ప్రిన్సిపాల్, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్, స్టూడెంట్స్ తదితరులు పాల్గొన్నారు.