
సరస్సుల అధ్యయనాన్ని లిమ్నాలజీ అంటారు.
సాంబార్ సరస్సు : రాజస్థాన్లో ఉంది. ఇది మనదేశంలోనే అతి పెద్ద భూపరివేష్టిత ఉప్పు నీటి సరస్సు.
చిల్కా సరస్సు : ఒరిస్సాలో ఉంది. ఇది మనదేశంలోనే అతి పొడవైన ఉప్పునీటి లాగూన్ (సముద్ర తీరం) సరస్సు.
ఊలార్ సరస్సు : జమ్ముకశ్మీర్లో ఉంది. ఇది మనదేశంలోనే అతి పెద్ద మంచినీటి సరస్సు. ఇది జీనం నది వల్ల ఏర్పడింది.
గోవింద సాగర్ : హిమాచల్ ప్రదేశ్లో ఉంది. ఇది మనదేశంలో కృత్రిమంగా నిర్మించిన అతిపెద్ద మంచినీటి సరస్సు. ఇది సట్లెజ్ నది వల్ల ఏర్పడింది.
చోలాము సరస్సు : సిక్కింలో ఉంది. 2011, ఆగస్టులో ఈ సరస్సును సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది. ఇది మన దేశంలో ఎత్తయిన సరస్సు.
లోనార్ సరస్సు : మహారాష్ట్రలో ఉంది. ఇది మన దేశంలో ఏకైక గ్రేటర్ సరస్సు (అగ్నిపర్వత ప్రక్రియ వల్ల ఏర్పడింది)
పులికాట్ సరస్సు : ఏపీ, తమిళనాడు సరిహద్దులో ఉంది. ఇది ఏపీలో పెద్ద ఉప్పునీటి సరస్సు. ఇది లాగూన్ రకానికి చెందింది.
కొల్లేరు సరస్సు : ఏపీలో కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల మధ్య ఏలూరుకు సమీపంలో ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్లో అతి పెద్ద మంచినీటి సరస్సు. ఇది ఆక్స్ బే రకానికి చెందింది. విస్తీర్ణం 250 చ.కి.మీ. కృష్ణా, గోదావరి మధ్య పల్లపు ప్రాంతంలో ఏర్పడింది.