
- నాలుగు సెగ్మెంట్లలో ఒక చోట 5వ, మూడు చోట్ల 3 స్థానం
- మొత్తం140 మంది పోటీ చేయగా 13 మందికే ఎక్కువ ఓట్లు
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ సిటీలోని హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల లోక్ సభ సెగ్మెంట్లలో ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో చాలామందికి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. నాలుగు సెగ్మెంట్లలో కలిపి మొత్తం140 మంది పోటీ చేశారు. ఇందులో 127 మందికి నోటా కంటే తక్కువగా పడ్డాయి. కాంగ్రెస్ , బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం అభ్యర్థులను పడిన ఓట్లను హైదరాబాద్ లో నోటా 5వ స్థానంలో ఉండగా, మిగతా మూడుచోట్ల నాలుగో స్థానంలో నిలిచింది. ఇలా ఒక్కో చోట పదుల సంఖ్యల్లో అభ్యర్థులు ఉన్నప్పటికీ పోటీ ఇవ్వలేకపోయారు.