టీ20 వరల్డ్ కప్ 2024లో ఘోరంగా విఫమలమైన కోహ్లీ.. ఫైనల్లో మాత్రం తన కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. శనివారం (జూన్ 29) దక్షిణాఫ్రికాపై జరిగిన తుది సమరంలో 59 బంతుల్లో76 పరుగులు చేసి భారత్ ను ఆదుకున్నాడు. విరాట్ ఇన్నింగ్స్ లో 6 ఫోర్లు, 2 సిక్సర్లున్నాయి. అక్షర్ పటేల్, శివమ్ దూబేలతో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పడంతో భారత్ 20 ఓవర్లలో 176 పరుగుల భారీ స్కోర్ చేయగలిగింది. జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించిన కోహ్లీకే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
ఈ టోర్నీలో కొహ్లీకిదే తొలి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్. దీంతో అంతర్జాతీయ టీ20 క్రికెట్ లో కోహ్లీ (16) అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ప్లేయర్ గా అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ మ్యాచ్ ముందు వరకు విరాట్ 15 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లతో టీ20 స్పెషలిస్ట్ సూర్య కుమార్ యాదవ్ తో సమానంగా ఉన్నాడు. ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకోవడంతో సూర్య రికార్డ్ ను బ్రేక్ చేశాడు. సూర్య 68 మ్యాచ్ ల్లో 15 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకుంటే.. విరాట్ కోహ్లీ 125 మ్యాచ్ ల్లో 16 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు.
ఈ లిస్ట్ లో రోహిత్ శర్మ, సికిందర్ రాజా, మహమ్మద్ నబీ, విరందీప్ సింగ్ 14 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులతో మూడో స్థానంలో ఉన్నారు. కోహ్లీ, రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20 లకు రిటైర్మెంట్ ప్రకటించడంతో ఈ రికార్డ్ భవిష్యత్తులో సూర్య పేరిట నిలిచే అవకాశం ఉంది. కోహ్లీతో పాటు బౌలర్లు సమిష్టిగా రాణించడంతో 11 ఏళ్ళ తర్వాత టీమిండియా ఐసీసీ ట్రోఫీ గెలుచుకుంది. ఫైనల్లో సౌతాఫ్రికాపై 7 పరుగుల తేడాతో విజయం సాధించి రెండోసారి టీ20 వరల్డ్ కప్ ను గెలుచుకుంది.
Virat Kohli stands atop with 16 Player of the Match awards in T20Is.🔝 pic.twitter.com/6lviwzrTRy
— CricTracker (@Cricketracker) July 1, 2024