పిల్లలతో పుస్తకాలు చదివిస్తే.. ఎన్ని లాభాలో తెలుసా..!

పిల్లలతో పుస్తకాలు చదివిస్తే.. ఎన్ని లాభాలో తెలుసా..!

కంప్యూటర్​ యుగంలో జనాలు టీవీలకు.. ఫోన్లకు అడెక్ట్​ అయిపోతున్నారు...కాదు  కాదు ఆల్​ రడీ అయ్యారు.  అస్సలు పుస్తకాలు చదవడం లేదు.  ఇప్పుడు కాలేజీలు .. స్కూళ్లలో కూడా పీడీఎఫ్​ ద్వారా నోట్స్​ పంపి దానిని చదువుకోమంటున్నారు.  పుస్తకాలు చదవకపోవడం వల్ల పిల్లలు ఙ్ఞానాన్ని కోల్పోతున్నరని ఓ అధ్యయనంలో తేలింది.  పుస్తకాలను పిల్లలతో చదివించడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసుకుందాం. . .!

ఈ రోజుల్లో పిల్లలు టెలివిజన్​ , కంప్యూటర్ గేమ్స్, ఇంటర్నెట్ ఫోన్లను అంటిపెట్టుకుని ఉంటున్నారే తప్ప అసలు పుస్తకాలు చదవాలన్న ఆలోచన ఉండడం లేదు. పుస్తకాలు చదవడం అనేది ఎంతటి ఆహ్లాదకరమో వారికి చెప్పినా అర్ధంకాదు. అందుకే పుస్తకాలు చదవడాన్ని అభిరుచి లేదా ఆసక్తిగా మార్చుకోవడం మంచి విషయంగా అమ్మానాన్నలే చెప్పాలి.

Also Read:-ఎండాకాలంలో జలుబుకు .. ఫ్లూ జ్వరానికి తేడా ఇదే..! 

ఈ అలవాటు చిన్న వయసు నుంచే వస్తే మరింత లాభం కూడా. మనిషి పెరుగుతున్న కొద్దీ వివిధ అంశాలపై ఆసక్తి చూపుతాడు. అందువల్ల చదువుకు సంబంధించిన పుస్తకాలే కాకుండా అన్ని రకాల పుస్తకాలు చదివే అలవాటును పెంచుకోవాలి. ఇదే అలవాటు పిల్లలకు కొత్తగా నేర్పడం అమ్మానాన్నల బాధ్యత కూడా. చిన్న వయసులోనే చదివే అలవాటును ఇష్టపడే పిల్లలు అపారమైన జ్ఞానాన్ని పొందే అవకాశం ఉంటుంది. 

ముందుగా పుస్తకాలు చదవడాన్ని నెమ్మదిగా పిల్లలకు అలవాటు చేస్తే, దానిలోని ఆహ్లాదాన్ని స్వయంగా అనుభవిస్తారు. చిన్న చిన్న సరదా కథలతో ముందుగా ప్రారంభించాలి. తర్వాత నిమిషాల సెషన్లతో, వాళ్లు ఎంజాయ్ చేసే కంప్యూటర్ గేమ్స్ కి కూడా కొంత టైమ్ కేటాయించాలి. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసేలా పెద్దలే చూసుకోవాలి. దీనికోసం ఓపిగ్గా వాళ్లని కన్విన్స్ చేయాలి. మెల్లిగా చదువుతూ ఉంటే, ఆసక్తి కూడా క్రమంగా పెరుగుతుంది. 

పిల్లలు ఎంత ఎక్కువగా చదివితే, కొత్తకొత్త పదజాలం అలవాటవుతుంది. అలాగే అవి వాళ్లకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. పదాలు, శబ్దాలతో పాటు విషయ పరిజ్ఞానం పెరుగుతుంది. ప్రత్యేక వ్యాసాలు, పుస్తకాలను చదవడం ద్వారా, పిల్లలు ప్రపంచం, చుట్టూ ఉన్న పరిసరాల గురించి తెలుసుకుంటారు. 

అది వాళ్లకు జీవితం మీద అవగాహన కలగడానికి, ప్రశ్నలు అడగడానికి, సమాధానాలు తెలుసుకోవడానికి తోడ్పడుతుంది. రెగ్యులర్ గా పుస్తకాలు చదువుతూ ఉంటే, కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. ఈ రోజుల్లో ఈ స్కిల్స్ ఎలాంటి ఉద్యోగానికైనా ఎంతో అవసరం. అలాగే పదాలను ఎలా, ఎక్కడ ఉపయోగించాలనే విషయాలు వాళ్లకు సులువుగా అర్ధం అవుతాయి