IPL 2025: ఐపీఎల్ 2025.. జియో హాట్ స్టార్‌లో ఎక్కువగా చూసిన మ్యాచ్ లు ఇవే!

IPL 2025: ఐపీఎల్ 2025.. జియో హాట్ స్టార్‌లో ఎక్కువగా చూసిన మ్యాచ్ లు ఇవే!

ఐపీఎల్ 2025లో మ్యాచ్ లు ఆసక్తికరంగా జరుగుతున్నాయి. ఈ మెగా లీగ్ జియో హాట్ స్టార్ లో లైవ్ స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. మార్చి 22న ప్రారంభమైన ఐపీఎల్ 2025 లో ఇప్పటివరకు 22 మ్యాచ్ లు జరిగాయి. వీటిలో ఎక్కువ వ్యూయర్ షిప్ సాధించిన టాప్-3 మ్యాచ్ ల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉండడం విశేషం. ఆర్సీబీ మ్యాచ్ లంటే అభిమానులు ఎగబడి చూస్తున్నారు. ఇప్పటివరకు జియో హాట్ స్టార్ లో చూసిన టాప్- 3 మ్యాచ్ లు ఏవో ఇప్పుడు చూద్దాం. 

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ కోల్ కతా నైట్ రైడర్స్:

ఐపీఎల్ సీజన్ 18లో తొలి మ్యాచ్ ఇది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా  కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన ఈ మ్యాచ్ కు 41.7 కోట్ల మంది జియో హాట్ స్టార్ లో చూశారు. ఓపెనర్స్ విరాట్ కోహ్లీ (59 నాటౌట్), సాల్ట్ (56) హాఫ్ సెంచరీలతో దుమ్మురేపగా.. చివర్లో కెప్టెన్ పటిదార్ (34) ధనాధన్ ఇన్సింగ్ ఆడటంతో ఈడెన్ గార్డెన్స్‎లో 7 వికెట్ల తేడాతో ఆర్సీబీ విజయం సాధించింది.        

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ 

చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడిన ఈ మ్యాచ్ ను 37.4 కోట్ల మంది చూశారు. ఈ మ్యాచ్ లో ఆర్‌‌సీబీ 50 రన్స్‌‌ తేడాతో చెన్నై సూపర్‌‌కింగ్స్‌‌కు చెక్‌‌ పెట్టింది. టాస్‌‌ ఓడి బ్యాటింగ్‌‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 196/7 స్కోరు చేసింది. తర్వాత చెన్నై 20 ఓవర్లలో 146/8 స్కోరుకే పరిమితమైంది.  17 ఏళ్ళ తర్వాత చెపాక్ లో బెంగళూరు జట్టు విజయం సాధించడం విశేషం. 

►ALSO READ | GT vs RR: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్.. ప్లేయింగ్ 11 నుంచి హసరంగా ఔట్!

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ముంబై ఇండియన్స్ 

వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడిన ఈ మ్యాచ్ ను 34.7 కోట్ల మంది వీక్షించారు. పటిదార్ కెప్టెన్ ఇన్నింగ్స్ తో పాటు విరాట్ కోహ్లీ (67) హాఫ్ సెంచరీ చేయడంతో ముంబై ఇండియన్స్ పై 12 పరుగుల తేడాతో గెలిచి ఊపిరి పీల్చుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఛేజింగ్ లో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగులకు పరిమితమైంది.