పోలీసులపై కాల్పులు జరిపింది మోస్ట్ వాంటెడ్ క్రిమినల్: డీసీపీ వినీత్

పోలీసులపై కాల్పులు జరిపింది మోస్ట్ వాంటెడ్ క్రిమినల్: డీసీపీ వినీత్

హైదరాబాద్: గచ్చిబౌలి కాల్పలు ఘటనపై మాదాపూర్ డీసీపీ వినీత్ కుమార్ స్పందించారు. ఈ మేరకు కేసుకు సంబంధించిన వివరాలను శనివారం (ఫిబ్రవరి 1) రాత్రి ఆయన మీడియాకు వెల్లడించారు. బత్తుల ప్రభాకర్ అనే పాత నేరస్తుడు ప్రిజం పబ్ దగ్గర పోలీసులపై ఫైర్ చేశాడని తెలిపారు. ఈ ఘటనలో వెంకట్ రెడ్డి అనే కానిస్టేబుల్‎కి గాయాలు అయ్యాయన్నారు. 

చిత్తూరు జిల్లాకు చెందిన బత్తుల ప్రభాకర్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అని.. అతడిపై 75 నుంచి 80 వరకు కేసులు ఉన్నాయని చెప్పారు. నిందితుడిపై రాబరీ కేసులు కూడా ఉన్నాయని తెలిపారు. 2023 నవంబర్ నుంచి ప్రభాకర్ పరారీలో ఉన్నాడు. ఈ క్రమంలోని ప్రభాకర్  గచ్చిబౌలిలోని ఓ పబ్బుకు వచ్చాడని సమాచారంతో పోలీస్ సిబ్బంది అక్కడికి వెళ్లారు. 

ALSO READ | హైదరాబాద్ గచ్చిబౌలిలో కాల్పుల కలకలం.. ప్రిజం పబ్ దగ్గర ఘటన

పోలీసులను చూసి ప్రభాకర్ కాల్పులు జరిపాడు. నిందితుడి కాల్పుల్లో సీసీఎస్ కానిస్టేబుల్ వెంకటరెడ్డి గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు నిందితుడిని చట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి రెండు తుపాకీలను, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. గాయపడిన కానిస్టేబుల్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని..  దర్యాప్తు తర్వాత మరిన్ని విషయాలు వెల్లడిస్తామని డీసీసీ వినీత్ పేర్కొన్నారు.