మోస్ట్ ​వాంటెడ్​సైబర్​ క్రిమినల్ ​అరెస్ట్ ..దేశ వ్యాప్తంగా 124 కేసులు 

మోస్ట్ ​వాంటెడ్​సైబర్​ క్రిమినల్ ​అరెస్ట్ ..దేశ వ్యాప్తంగా 124 కేసులు 

బషీర్​బాగ్, వెలుగు: దేశ వ్యాప్తంగా సైబర్​నేరాలకు పాల్పడుతున్న మోస్ట్​ వాంటెడ్​ క్రిమినల్​ మహమ్మద్ జుబైర్(31)ను హైదరాబాద్​సైబర్ ​క్రైమ్​ పోలీసులు అరెస్ట్ చేశారు. సైబర్ క్రైమ్స్ డీసీపీ డి.కవిత వివరాల ప్రకారం.. గతేడాది 24న మనీలాండరింగ్​ కేసులో డిజిటల్​అరెస్ట్ ​పేరిట సిటీకి చెందిన వ్యక్తిని సైబర్​నేరగాళ్లు మోసగించారు. అతని నుంచి రూ.55 లక్షలు కాజేశారు.

బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో ప్రధాన నిందితుడైన, దుబాయ్​లో ఉండే మహమ్మద్ జుబైర్, మరో నలుగురిని పోలీసులు గుర్తించారు. జుబైర్​పై లుక్ ఔట్ సర్క్యులర్ జారీ చేశారు. తాజాగా జుబైర్ దుబాయ్ నుంచి హైదరాబాద్​ రాగా ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. అతనిపై దేశవ్యాప్తంగా 124 కేసులు నమోదై ఉన్నాయి. తెలంగాణలో 23 కేసులు ఉన్నాయి.