హైదరాబాద్: మోస్ట్ వాటెండ్ గంజాయి డాన్ అంగూర్ బాయ్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. ఆపరేషన్ ధూల్ పేట్లో భాగంగా కర్వాన్‌లో అంగూర్ బాయ్‌ను ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అంగూర్ బాయ్ అరెస్ట్‌కు సంబంధించిన వివరాలను పోలీసులు మీడియాకు వెల్లడించారు. ధూల్‌పేట్‌లో గంజాయి డాన్‌గా ఎదిగిన అంగూర్ బాయ్ పది కేసుల్లో నిందితురాలిగా ఉన్నారని.. కొన్నాళ్లుగా ఆమె పోలీసులకు దొరక్కకుండా తప్పించుకు తిరుగున్నారని తెలిపారు.
గంజాయి అమ్మకాల్లో రూ. కోట్లకు పడగలెత్తిన అంగూర్ బాయ్‌పై ధూల్‌పేట్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లో 3 కేసులు, మంగల్‌హట్ పోలీస్ స్టేషన్‌లో 4 కేసులు, ఆసిఫ్ నగర్, గౌరారం స్టేషన్లలో కొన్ని కేసులు ఉన్నాయన్నారు. గతంలో కొన్ని కేసుల్లో ఆమె జైలుకు కూడా వెళ్లొచ్చిందన్నారు.
అంగూర్ బాయ్ కుటుంబ సభ్యులు పది నుంచి 15 మందిపై ఐదు నుంచి పది కేసులు ఉన్నాయని తెలిపారు. ఈ క్రమంలోనే ధూల్‌పేట్‌లో గంజాయి హూల్‌సేల్, రిటేల్ అమ్మకాల్లో అరితేరిన అంగూర్ బాయ్‌ని అపరేషన్ ధూల్‌పేట్‌లో భాగంగా కార్వాణ్ ప్రాంతంలో ఎస్టీఎఫ్, ఎక్సైజ్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారని వెల్లడించారు. లేడీ డాన్‌ను అరెస్టు చేసిన ఎస్టీఎఫ్, ఎక్సైజ్ పోలీసులను ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ కమలాసన్‌రెడ్డి అభినందించారు.