- ఇప్పటికే 13 కేసుల్లో జైలుకు వెళ్లొచ్చిన అంగూర్ బాయి
మెహిదీపట్నం, వెలుగు : హైదరాబాద్ ధూల్‌పేట్‌లో మోస్ట్ వాంటెండ్ లేడీ గంజాయి డాన్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. పదుల కేసుల్లో ముద్దాయిగా ఉన్న ఆమె కొంతకాలంగా పోలీసులకు చిక్కకుండా ముప్పతిప్పలు పెడుతోంది. ఆపరేషన్ ధూల్‌పేట్‌లో భాగంగా గురువారం కార్వాన్ లో నిందితురాలిని ఎస్టీఎఫ్, ఎక్సైజ్ పోలీసులు నిఘా పెట్టి అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ధూల్‌పేట్‌లో హోల్‌సేల్, రిటైల్ గంజాయి అమ్మకాల్లో ఆరితేరిన అంగూర్ బాయి రూ.కోట్లు సంపాదించింది. ఇప్పటికే13 కేసుల్లో జైలుకు వెళ్లొచ్చింది.
Also Read :- పెళ్లి పీటలెక్కుతున్న చిన్నారులు
ఆమె కుటుంబ సభ్యుల్లోని 15 మందిపై ఐదు నుంచి పది కేసులు ఉన్నాయి. ప్రస్తుతం ధూట్పేట ఎక్సైజ్ పీఎస్‌లో 3 కేసుల్లో, మంగళ్ హాట్ లో 4 , ఆసిఫ్ నగర్ , గౌరారం పరిధిలో 10 కేసుల్లో ఆమె నిందితురాలిగా ఉంది. అరెస్టు చేయడానికి ఎక్సైజ్, పోలీసులు ఎన్నిమార్లు నిఘా పెట్టిన అంగూర్ బాయి తప్పించుకొని తిరుగుతోంది. గురువారం ఆమెను ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. అంగూర్ బాయ్‌ని అరెస్టు చేసిన ఎస్టీఎఫ్, ఎక్సైజ్ పోలీసులను ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ వీబీ కమలాసన్‌రెడ్డి అభినందించారు.