మోస్ట్ వాంటెండ్ సీరియల్ కిల్లర్ అరెస్ట్.. రైళ్లో ప్రయాణించే వారే ఇతని టార్గెట్

రైళ్లలో ప్రయాణిస్తూ.. హత్యలు, దోపిడీకి పాల్పడిన ఓ సీరియల్ కిల్లర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. దేశవాప్తంగా 35 రైళ్లలో హత్యలు, దోపిడీలు చేసి పోలీసుల కంటపడకుండా తిరుగుతున్న నేరస్తుడు అతను. కరంవీర్ పోలీసులకు మోస్ట్ వాండెంట్ కిల్లర్ గా ఉన్నాడు. కరంవీర్‌ ట్రైన్లో దివ్యాంగుల బోగీల్లోకి చొరబడి దోపిడీలు, హత్యలు చేస్తుండేవాడు. దేశవ్యాప్తంగా అతనిపై పలు కేసులు ఉన్నాయి. హైదరాబాద్ పోలీసులు కరంవీర్ ను గుజరాత్ లో అరెస్ట్ చేశారు. పీటీ వారెంట్‌పై నిందితుడిని హైదరాబాద్‌ తీసుకువస్తున్నారు.