మోస్ట్‌ వాంటెడ్‌ డ్రగ్‌ స్మగ్లర్‌‌ అరెస్ట్‌

మోస్ట్‌ వాంటెడ్‌ డ్రగ్‌ స్మగ్లర్‌‌ అరెస్ట్‌
  • హర్యానాలో అదుపులోకి తీసుకున్న పోలీసులు

చండీఘడ్‌: మోస్ట్‌వాంటెడ్‌ డ్రగ్స్‌ స్మగ్లర్‌‌ రంజిత్‌ సింగ్‌ రాణాను హర్యానా పోలీసులు శనివారం అరెస్టు చేశారు. దాదాపు రూ.2700 కోట్ల విలువ గల 532 కేజీల హెరయిన్‌ తరలిస్తున్న కేసులో అతను నిందితుడని పోలీసులు చెప్పారు. గత కొద్ది రోజులుగా తప్పించుకుని తిరుగుతున్న అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని డీజీపీ దినకర్‌‌ గుప్తా చెప్పారు. సిర్సాలోనే అతిపెద్ద డ్రగ్‌ స్మగ్లర్‌‌గా పేరు ఉన్న రాణాకు చెందిన రూ.2700 కోట్ల విలువ గల నార్కోటిక్స్‌ను అమృత్‌సర్‌‌లోని అట్టారీ చెక్‌పోస్ట్‌ దగ్గర పోలీసులు సీజ్‌ చేశారు. అప్పటి నుంచి నిందితుడు తప్పించుకుని తిరుగుతున్నాడు. జమ్మూకాశ్మీర్‌‌లో హిజ్బుల్‌ కమాండర్‌‌ను ఎన్‌కౌంటర్ కారణంగా హర్యానాలోని సీర్సా తదితర ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించగా.. రాణా పట్టుబడ్డాడు. “ జమ్మూకాశ్మీర్‌‌ ఘటన నేపథ్యంలో పంజాబ్‌ పోలీసులు తనిఖీలు చేసి డ్రగ్‌ స్మగ్లర్‌‌ రాణాను అరెస్టు చేశారు. అతని సోదరుడు గంగాదీప్‌ భోలాను కూడా అరెస్టు చేశారు” అని డీజీపీ ట్వీట్‌ చేశారు.