ఈడీకి వ్యతిరేకంగా కాంగ్రెస్​ నిరసన

ఈడీకి వ్యతిరేకంగా కాంగ్రెస్​ నిరసన

అంబర్​పేట, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు మోత రోహిత్ ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ పేరును చార్జ్ షీట్ లో చేర్చడంపై మండిపడ్డారు. రోహిత్ ఆధ్వర్యంలో గురువారం ఈడీకి వ్యతిరేకంగా  హైదరాబాద్ బషీర్​బాగ్ ​లిబర్టీ సర్కిల్ వద్ద వినూత్న నిరసన చేపట్టారు.

 ఈడీ అంటే ఎనిమీ ఆఫ్ డెమోక్రసీ అంటూ ప్ల కార్డులు ప్రదర్శించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన గాంధీ కుటుం బం ఇలాంటి చిల్లర కేసులకు భయపడదన్నారు. అనంతరం ఈడీ ఆఫీస్ ​ముందు పీసీసీ చీఫ్​మహేశ్​కుమార్ గౌడ్ చేపట్టిన ధర్నాకు తరలివెళ్లారు.