జగిత్యాల జిల్లా : అర్బన్ మండలం మోతె చెరువుకు మంగళవారం రాత్రి గండి పడింది. చెరువులో నీరు దిగువ ప్రాంతానికి ఉధృతంగా ప్రవహిస్తోంది. భారీ వర్షాలకు చెరువు నిండు కుండలా మారడంతో కట్ట తెగి.. గండి పడింది. దీంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గండి పడ్డ ప్రదేశాన్ని పూడ్చి వేయకపోతే దిగువ ప్రాంతాలకు నీరు ప్రవహిస్తూ సమీపంలోని పంట పొలాలు నీట మునుగుతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇండ్లలోకి కూడా నీరు చేరవచ్చని ప్రజలు భయాందోళన చెందుతున్నారు.