న్యూఢిల్లీ: త్వరలో ఐపీఓకు రాబోతున్న ట్రావెల్ టెక్ ప్లాట్‌ఫామ్ ఓయో శనివారం అమెరికన్ బడ్జెట్ హోటల్ చైన్ మోటెల్ 6, స్టూడియో 6 బ్రాండ్‌లను కొనుగోలు చేయడానికి అంగీకరించినట్లు ప్రకటించింది. బ్లాక్‌స్టోన్ రియల్ ఎస్టేట్ నుంచి వీటిని 525 మిలియన్ డాలర్లకు దక్కించుకుంటామని తెలిపింది. ఇది పూర్తిగా నగదు ఒప్పందం. ఓయో మాతృ సంస్థ ఒరావెల్ స్టేస్, జీ6 హాస్పిటాలిటీ, ఆఫ్‌షూట్ హోటల్ బ్రాండ్ స్టూడియో 6ని కొనుగోలు చేయడానికి అంగీకరించాయి.ఈ ఏడాది నాలుగో క్వార్టర్లో లావాదేవీ ముగుస్తుంది.
మోటెల్ 6 ఫ్రాంఛైజ్ నెట్‌వర్క్ 1.7 బిలియన్ డాలర్ల గ్రాస్ రూమ్ రెవెన్యూను సాధిస్తోంది. మోటెల్ 6, స్టూడియో 6 బ్రాండ్‌లను మరింత బలోపేతం చేయడానికి ఆర్థిక వృద్ధిని కొనసాగించడానికి గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్, మార్కెటింగ్ నైపుణ్యాన్ని ఉపయోగిస్తామని ఓయో పేర్కొంది. తాము అమెరికాలో 35 రాష్ట్రాల్లో 320 హోటళ్లను నిర్వహిస్తున్నామని తెలియజేసింది.