సకల సౌకర్యాలతో మొతెరా అదుర్స్‌

వరల్డ్‌ లార్జెస్ట్‌ క్రికెట్‌ స్టేడియంలో అధునాతన సౌకర్యాలు

అహ్మదాబాద్‌‌‌‌‌‌‌‌‌‌: ఓవైపు సబర్మతి నదీ .. మరోవైపు వరల్డ్‌‌‌‌ లార్జెస్ట్‌‌‌‌ క్రికెట్‌‌‌‌ స్టేడియం.. చూడటానికి రెండు కళ్లు సరిపోనంత విశాలమైన గ్రౌండ్‌‌‌‌. అందులోని వసతులను చూస్తే.. ప్రపంచం మొత్తం తిరిగే క్రికెటర్లు కూడా ఔరా అని ముక్కున వేలేసుకున్నారు. 1982లో నిర్మించిన స్టేడియాన్ని కూల్చేసి దాని స్థానంలో రీ కన్‌‌‌‌స్ట్రక్ట్‌‌‌‌ చేసిన నయా మొతెరాలో అడుగడుగున అబ్బురపరిచే అంశాలు కనబడుతాయి.

63 ఎకరాలలో అత్యంత అధునాతమైన సౌకర్యాలతో నిర్మించిన స్టేడియంలో ఎక్కడా పిల్లర్లు కనిపించవు. ఇంజనీరింగ్‌‌‌‌ నైపుణ్యాన్నికి ఇది ఓ ప్రతీక కాగా, లోపలికి వెళ్లేందుకు నాలుగు మెయిన్​ ఎంట్రన్స్​లను ఏర్పాటు చేశారు. ఈ స్టేడియం నిర్మాణానికి రూ. 800 కోట్లు ఖర్చు చేశారు. ప్రపంచంలో ఏ స్టేడియంలో లేని విధంగా నాలుగు డ్రెస్సింగ్‌‌‌‌ రూమ్‌‌‌‌లు ఉన్నాయి. కనెక్టెడ్‌‌‌‌ జిమ్స్‌‌‌‌ ఉండటం మరో ప్రత్యేకత. ప్లేయర్లు ఏ టైమ్‌‌‌‌లోనైనా జిమ్‌‌‌‌ చేసుకునే విధంగా వీటిని రూపొందించారు. ఫ్లోరింగ్‌‌‌‌ మొత్తం సింథటిక్‌‌‌‌ రబ్బర్‌‌‌‌తో ఏర్పాటు చేశారు. ప్లేయర్లు వామప్‌‌‌‌ కూడా ఇక్కడే చాన్స్‌‌‌‌ ఉంటుంది.

పెవిలియన్‌‌‌‌ నుంచి గ్రౌండ్‌‌‌‌లోనికి అడుగుపెట్టడానికి క్రికెటర్లు దాదాపు 82 మెట్లు దిగాల్సి ఉంటుంది. 11 సెంటర్‌‌‌‌ పిచ్‌‌‌‌లు ఉన్న ఏకైక స్టేడియం ఇదొక్కటే. రెడ్‌‌‌‌, బ్లాక్‌‌‌‌ మిక్సింగ్‌‌‌‌తో ఈ పిచ్‌‌‌‌లను రూపొందించారు. ఔట్‌‌‌‌ ఫీల్డ్‌‌‌‌లో గ్రాస్‌‌‌‌ (ఆస్ట్రేలియా నుంచి తెచ్చిన బెర్ముడా గడ్డి) కింద సాండ్‌‌‌‌ను వేశారు. దీనివల్ల ప్లేయర్‌‌‌‌ కిందపడినా పెద్దగా దెబ్బలు తగలవు. కోచ్‌‌‌‌ క్యాబిన్‌‌‌‌తో పాటు స్పెషల్‌‌‌‌ మీటింగ్‌‌‌‌ రూమ్‌‌‌‌ కూడా ఉంటుంది. ఒకేసారి ముగ్గురు ప్లేయర్లకు ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ ఇచ్చే విధంగా ఏర్పాటు చేశారు.

చిన్న పెవిలియన్‌‌‌‌తో కూడిన రెండు ప్రాక్టీస్‌‌‌‌ గ్రౌండ్స్‌‌‌‌ ఉండటం మరో ప్రత్యేకత. బౌలింగ్‌‌‌‌ మిషన్స్‌‌‌‌తో కూడిన ఆరు ఇండోర్‌‌‌‌ పిచ్‌‌‌‌లు ఉన్నాయి. నెట్‌‌‌‌ ప్రాక్టీస్‌‌‌‌ పిచ్‌‌‌‌లు  అదనం. ఇండోర్‌‌‌‌ క్రికెట్‌‌‌‌ అకాడమీతో పాటు ప్రాక్టీస్‌‌‌‌ కోసం 200 మీటర్ల జాగింగ్‌‌‌‌ ట్రాక్‌‌‌‌ ఉంది.

అన్ని స్టేడియాల్లో వాడే హైమాస్ట్‌‌‌‌ లైట్స్‌‌‌‌ కాకుండా పైకప్పుకు ఎల్‌‌‌‌ఈడీ లైట్స్‌‌‌‌ను అమర్చారు. దీనివల్ల గ్రౌండ్‌‌‌‌లో నీడ (షాడో) పడదు. హై క్యాచ్‌‌‌‌లను అందుకునేటప్పుడు ఫీల్డర్‌‌‌‌కు విజన్‌‌‌‌ ప్రాబ్లమ్‌‌‌‌ కూడా ఉండదు.

స్టేడియం పక్కన పార్కింగ్‌‌‌‌ కోసం చాలా ప్లేస్​ ఉంచారు. ఒకేసారి 3 వేల కార్లు, 10 వేల బైక్స్‌‌‌‌ పార్కింగ్‌‌‌‌ చేసుకోవచ్చు. ఎమర్జెన్సీ టైమ్‌‌‌‌లో అంబులెన్స్‌‌‌‌, ఇతర ట్రక్‌‌‌‌లు నేరుగా స్టేడియం లోపలికి వచ్చే విధంగా రూట్‌‌‌‌ నిర్మించారు.

8 సెంటీ మీటర్ల భారీ వర్షం కురిసినా అర గంటలోపే గ్రౌండ్‌‌‌‌ను క్లియర్‌‌‌‌ చేసే అధునాతన డ్రైనేజ్‌‌‌‌ సిస్టమ్‌‌‌‌ దీని స్పెషల్‌‌‌‌. ఇందుకోసం ఫారిన్‌‌‌‌ ఎక్విప్‌‌‌‌మెంట్‌‌‌‌ను ఉపయోగిస్తున్నారు. స్టేడియం మొత్తాన్ని క్లీన్‌‌‌‌గా ఉంచేందుకు రూ. 2 కోట్లతో ఎక్విప్‌‌‌‌మెంట్స్‌‌‌‌ను కొనుగోలు చేశారు.

50 డీలక్స్‌‌‌‌ గదులు, ఓ క్లబ్‌‌‌‌ హౌస్​, ఐదు సూట్స్‌‌‌‌తో కూడిన చిన్నపాటి హోటల్‌‌‌‌ ఈ స్టేడియంలో ఉంది. ఇందులో 3డీ మిని థియేటర్‌‌‌‌, స్విమ్మింగ్‌‌‌‌పూల్‌‌‌‌, జిమ్నాజియం, క్రికెటర్లు రిలాక్స్‌‌‌‌ అయ్యేందుకు ‘స్టీమ్‌‌‌‌ అండ్‌‌‌‌ సానా’ గది ఉంటాయి.

For More News..

స్టార్​ కంపెనీలుగా మారిన స్టార్టప్ కంపెనీలు

గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీకి మస్తు నామినేషన్లు