వీరభద్రస్వామి ఆలయానికి ముప్పు!

వీరభద్రస్వామి ఆలయానికి ముప్పు!

భద్రాచలం, వెలుగు : గోదావరి నడిమధ్యలో ద్వీపంలా ఉండే 2 ఎకరాల ప్రాంతంలో కొలువై ఉన్న మోతెగడ్డ వీరభద్రస్వామి ఆలయం ప్రమాదపుటంచున ఉంది. ఇటీవల వచ్చిన భారీ వరదలకు గుడి చుట్టూ భాగం మొత్తం కోతకు గురైంది. బూర్గంపాడు మండలం ఇరవెండి పరిధిలోని మోతె గ్రామం నుంచి పడవల్లో ఈ ఆలయానికి నిత్యం భక్తులు దర్శనానికి వెళ్తుంటారు. శివరాత్రి సమయంలో ఏడు రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి.

 కాకతీయుల కాలం నాటి ఈ ఆలయంపై భద్రాచలం మన్యంలో పలువురు భక్తులకు నమ్మిక. ఎండోమెంట్​ పరిధిలో ఈ ఆలయం ఇప్పుడు ప్రమాదంలో చిక్కుకుంది. ఎల్​ షేప్​లో భూమి మొత్తం వరదలతో కోతకు గురైంది. వెంటనే రిపేర్లు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు. కాగా ఇటీవల పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఎండోమెంట్​ఆఫీసర్లతో మోతెగడ్డను సందర్శించారు. ఎండోమెంట్​ డీసీ, ఏసీ, డీఈలను తీసుకుని ఆయన వీరభద్రస్వామి ఆలయంలో అవసరమైన పనుల కోసం ఎస్టిమేషన్లు తయారు చేయాలని ఆదేశించారు. ఇంజినీర్లు ఇచ్చే నివేదిక ప్రకారం ఎస్టిమేషన్లను డీసీ ద్వారా కమిషనర్​కు పంపుతామని, వారి ఆమోదం వచ్చాక రిపేర్ల పనులు ప్రారంభిస్తామని ఖమ్మం జిల్లా ఎండోమెంట్ అసిస్టెంట్​ కమిషనర్​ వీరస్వామి 

తెలిపారు.