కరెంట్ షాక్తో.. నిద్రలోనే తల్లీకూతుళ్లు మృతి

కరెంట్ షాక్తో.. నిద్రలోనే  తల్లీకూతుళ్లు మృతి

పెద్దపల్లి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది.  రామగిరి మండలం రత్నాపూర్ గ్రామంలోని ఓ ఇంట్లో విద్యుత్ షాక్ తో ఇద్దరు తల్లీ కూతుళ్లు నిద్రలోనే సజీవదహనం అయ్యారు. 

పోలీసుల వివరాల ప్రకారం.. రాంనగర్ లోని   గడ్డం కనకయ్య  తన భార్య, అత్తతో కలిసి ఒక ఇల్లు అద్దెకు తీసుకొని జీవనం సాగిస్తున్నారు. వీరితోపాటు ఇంట్లో పెంపుడు కుక్క, ఒక కోడి కూడా చనిపోయాయి. గ్రామానికి చెందిన  గడ్డం కోమురమ్మ (45), కల్వల పోచమ్మ (65) అనే ఇద్దరు తల్లి కూతుళ్ళు అక్టోబర్ 28న అర్ధరాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇళ్ళంతా మంటలు వ్యాపించి మృతి చెందినట్లు  స్థానికులు, పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. 

గోదావరిఖని ఏసీపీ రమేష్, మంథని సీఐలు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. ఇంట్లో కూలర్, విద్యుత్ వైర్లు, కాలిపోయాయని ఏసీపి రమేష్ తెలిపారు.  క్లూస్ టీమ్ ను  రంగంలోకి దించి పరిసరాలను పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. కనకయ్య పని నుంచి రాత్రి  ఇంటికి వచ్చి చూడగానే  ప్రమాదాన్ని చూసి భయపడి తన బావమరిదిని తీసుకొని వచ్చినట్లు పోలీసులు తెలిపారు.