తిమ్మాపూర్ లో ట్రాక్టర్ బోల్తా పడి తల్లీ కూతురు మృతి

తిమ్మాపూర్ లో ట్రాక్టర్ బోల్తా పడి తల్లీ కూతురు మృతి

షాద్ నగర్, వెలుగు:  కొత్తూరు పీఎస్​ పరిధిలోని తిమ్మాపూర్ హుక్స్ కంపెనీ వద్ద ట్రాక్టర్ బోల్తా పడగా తల్లీ కూతురు చనిపోయారు.  శనివారం రెడ్డి పాలెంలో పత్తి తీసేందుకు కర్నూల్ నుంచి వలస కూలీలు ట్రైన్ లో వచ్చారు.  రెడ్డిపాలెంకు  ట్రాక్టర్ లో వెళ్తుండగా తిమ్మాపూర్‌‌లోని హుక్స్ కంపెనీ వద్దకు వెళ్లగానే ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది.  యాక్సిడెంట్ లో తల్లి సోమమ్మ, ఈమె కూతురు మమత (6) చనిపోయారు. మరో ఇద్దరు కూలీలు ఉరవకొండమ్మ, వెంకటేశ్వరమ్మకు గాయాలయ్యాయి.  వీరిని  షాద్ నగర్  ఆసుపత్రికి తరలించారు.  కొత్తూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

గుర్తు తెలియని వెహికల్ ఢీకొని వ్యక్తి మృతి 

కీసర: కీసర పీఎస్​ పరిధిలో గుర్తు తెలియని వెహికల్ ఢీకొనడంతో ఒకరు చనిపోయాడు. బిహార్ నుంచి షియా శరణ్​ రాయ్ (37) మార్బుల్స్​ పని కోసం నగరానికి వచ్చాడు. సుర్వి బాబయ్య ఫంక్షన్ హాల్ ఎదురుగా శనివారం అర్ధరాత్రి పని ముగించుకొని ఇంటికి వెళ్తున్నాడు. రోడ్డు దాటుతుండగా  గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో చనిపోయాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకటయ్య  తెలిపారు. 

ఆర్టీసీ బస్సును వెనక నుంచి ఢీకొట్టిన కారు

కూకట్‌పల్లి:  కూకట్ పల్లి వై జంక్షన్ సమీపంలో  ఆదివారం మధ్యాహ్నం వేగంగా వచ్చిన కారు ముందు వెళుతున్న ఆర్టీసీ బస్సును వెనక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వ్యక్తులకు ఎలాంటి గాయాలు కాలేదు. కారు నుజ్జు నుజ్జయింది. 

కానిస్టేబుల్ ఓవర్ స్పీడ్.. ఇద్దరికి గాయాలు

ఘట్‌కేసర్,:  ఘట్ కేసర్ మండలం -ఏదులాబాద్ అండర్ పాస్ వద్ద శనివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. కానిస్టేబుల్ రాజేశ్ తన కారును స్పీడ్​గా వెళ్తూ ఎంకిర్యాల్‌కు  చెందిన తంబాలి నవీన్‌ కుమార్(25), మెరుగు సాయిచరణ్ (19) బైక్ ను ఢీకొట్టాడు. దీంతో నవీన్​ కాలు నుజ్జునుజ్జయ్యింది. పోలీసులు రాజేశ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని సీఐ పరుశురాం తెలిపారు. 

లారీ బోల్తా.. దంపతులకు గాయాలు

కీసర: కీసరలో కంటైనర్ లారీ బోల్తా పడి డ్రైవర్​తోపాటు అతని భార్యకు గాయాలయ్యాయి. మేడ్చల్ జిల్లా కీసర అంకిరెడ్డిపల్లిలోని సాల్వో కెమికల్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన లారీ ఆదివారం హిమాచల్ ప్రదేశ్ కు బయలుదేరింది. ఔటర్ రింగ్ రోడ్డులోని మొదటి రోటర్ వద్ద రాగానే, అదుపుతప్పి పక్కకు పల్టీ కొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్ దిలీప్​తోపాటు వాహనంలో ఉన్న అతని భార్య గాయపడ్డారు. సీఐ వెంకటయ్య  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.