హైదరాబాద్ లో దారుణం జరిగింది.. అనారోగ్య సమస్య కారణంగా తల్లి మరణించడంతో తట్టుకోలేక కొడుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన లాలాగూడ పోలీస్టేషన్ పరిధిలోని లాలాపేటలో చోటుచేసుకుంది ఈ ఘటన. శనివారం ( జనవరి 4, 2025 ) వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి.. లాలాపేటలోని వినోభానగర్ ప్రాంతానికి చెందిన లక్ష్మి(52) అభినయ్ (20) లు తల్లీకొడుకులు. వీరిద్దరు ఎనిమిది సంవత్సరాలుగా అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. తల్లి కేన్సర్ పేషెంట్ కావడంతో ఆమె కుమారుడు అభినయ్ డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. తల్లి ఆనారోగ్యానికి మందుల ఖర్చుకు, కాలేజీ ఫీజుకై చేతికి దొరికిన పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
అయితే, శనివారం ( జనవరి 4, 2025 ) మధ్యాహ్నం సమయంలో ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండడంతో ఇంటి యజమాని బ్రహ్మాజీ సదరు ఇంటి తలుపులు ఎంత కొట్టినా ఎవ్వరూ కూడా తెరవకపోవడంతో స్థానిక లాలాగూడ పోలీసులకు సమాచారం అందించాడు బ్రహ్మాజీ. యజమాని ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు బద్దలుగొట్టి చూడగా.. హాల్లో అబినయ్ సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకొని కనిపించాడు. లోపలికి వెళ్లి చూడగా బెడ్ రూమ్ లో తల్లి కూడా మరణించి ఉన్నట్లు గమనించారు పోలీసులు.
ఈ క్రమంలో పోలీసులు ఇంటిని పరిశీలించగా మృతురాలు లక్ష్మికి సంబంధించిన మెడికల్ రిపోర్ట్ తో పాటు అభినయ్ రాసిన ఒక సూసైడ్ నోట్ కనిపించినట్లు తెలిపారు. అందులో 'నాకు మా అమ్మకు ఆరోగ్య సమస్యలున్నాయి. నాకు తండ్రి కూడా లేడు... మా బంధువుల కోసం వెతక్కండి. ఐ యామ్ సారీ' అని ఇంగ్లీష్ రాసుందని తెలిపారు పోలీసులు.
కాగా, తల్లి లక్ష్మి అనారోగ్యంతో చనిపోవడంతో అది తట్టుకోలేక అబినయ్ ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు బావిస్తున్నారు. వీరు మృతి చెంది రెండ్రోజులు కావచ్చని భావిస్తున్నారు పోలీసులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు.