పెద్దకోటపల్లి మండలంలో తల్లి, ముగ్గురు పిల్లలు మిస్సింగ్

పెద్దకోటపల్లి మండలంలో తల్లి, ముగ్గురు పిల్లలు మిస్సింగ్

మేడిపల్లి, వెలుగు: మేడిపల్లి పోలీస్టేషన్ పరిధిలో తల్లి, ముగ్గురు పిల్లలు మిస్సయ్యారు. పోలీసుల వివరాల ప్రకారం.. నాగర్​కర్నూల్​జిల్లా పెద్దకోటపల్లి మండలం ముష్టపాదికి చెందిన శగ్గడి రాముడు‌‌‌‌–శివలీల దంపతులకు ఇద్దరు కుమారులు ఓంకార్, మోక్షిత్, ఒక పాప ఉన్నారు. ఈ కుటుంబం బోడుప్పల్​లో నివాసం ఉంటోంది. రాముడు స్థానికంగా కూలీ పని చేస్తున్నాడు.  గత నెల23న ఉదయం అతను పనికి వెళ్లాడు. శివలీల  ముగ్గురు పిల్లలతో బయటకు వెళ్లి, తిరిగి రాలేదు. 

కుటుంబసభ్యులు బంధువులు, తెలిసిన వారిని ఆరా తీసినా ఆచూకీ దొరకలేదు. దీంతో, రాముడు సోమవారం మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు.