నర్సాపూర్‌‌లో తల్లి, ఇద్దరు పిల్లలు మిస్సింగ్

నర్సాపూర్‌‌లో  తల్లి, ఇద్దరు పిల్లలు మిస్సింగ్

నర్సాపూర్, వెలుగు: మెదక్ జిల్లా నర్సాపూర్ పీఎస్​లో తల్లి, ఇద్దరు పిల్లల మిస్సింగ్ కేస్ నమోదైంది. ఎస్ఐ లింగం తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని సునీతా లక్ష్మారెడ్డి కాలనీకి చెందిన పిల్లముల సిరివెన్నెల ఈ నెల 20న తన కుడిచేయి విరిగిందని వైద్యం కోసం తన ఇద్దరు పిల్లలు శ్రీయుత, మన్విత్ ను తీసుకొని షాపూర్ లోని ఓ ఆస్పత్రికి వెళ్లి రాలేదు. ఆమె భర్త భూపతిరాజు ఆమె ఫోన్ నంబర్ కు కాల్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చిందని, చుట్టుపక్కల, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ దొరకలేదన్నారు. శనివారం కంప్తైంట్​చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

 ఇంటర్ స్టూడెంట్..​

శివ్వంపేట: మండలంలోని దంతాన్ పల్లి గ్రామానికి చెందిన మల్లేశ్ పెద్ద కొడుకు రేవంత్ కుమార్ (16) అదృశ్యం అయ్యాడు. అతను తూప్రాన్ పట్టణంలోని శ్రీ చైతన్య కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. శనివారం మధ్యాహ్నం ఒంటిగంటకు రేవంత్ కుమార్ వ్యవసాయ పొలం వద్ద పశువులకు నీళ్లు పెట్టి వస్తానని వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఫోన్ చేసిన స్విచ్ ఆఫ్ రావడంతో పొలం దగ్గర, చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. కొద్ది రోజులుగా జాతర్లల్లో బోనం ఎత్తుకోవడానికి వెళ్తున్నాడని, మూడుసార్లు వెళ్లి పట్టుకుని వచ్చామని,  ఇప్పుడు కూడా అక్కడికి వెళ్లాడని అనుమానం ఉందని తండ్రి మల్లేశ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.