
- భర్తతో గొడవపడి కనిపించకుండాపోయిన తల్లీ బిడ్డలు
ఘట్‌కేసర్, వెలుగు: భర్తతో గొడవపడి ఇద్దరు కూతుళ్లతో కలిసి తల్లి కనిపించకుండా పోయింది. సీఐ పరుశురాం తెలిపిన వివరాల ప్రకారం.. ఘట్‌కేసర్ మున్సిపల్ కార్యాలయం సమీపంలో నివాసముంటున్న పొదిలి నాగరాజు తన భార్య లావణ్య (33)తో సోమవారం గొడవపడ్డాడు. దీంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురై భర్త ఇంట్లో లేని సమయంలో తన ఇద్దరు కూతుళ్లు శ్రావణి(14), మేఘన(13)తో కలిసి ఎవరికి చెప్పకుండా ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది.
ఇంటికి వచ్చిన భర్త కు ఇంట్లో ఎవరూ కనిపించలేదు. దీంతో సోమవారం రాత్రి నాగరాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పరుశురాం తెలిపారు.